Health Tips: సాధారణంగా ప్రకృతి లో ఉండే అనేక రకాల చెట్లు మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని రకాల చెట్ల లో ఉండే ఔషధ గుణాల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేయవచ్చు. అటువంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కలు శంఖు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ప్రతి ఇంటి దగ్గర పెంచేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఈ మొక్క కనుమరుగై పోతోంది. ఈ మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
శంఖు మొక్కలో కూడా ఆరోగ్యాన్ని కాపాడటానికి అవసరమైన అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. బ్రెయిన్ టానిక్ గా సాంప్రదాయ వైద్య వ్యవస్థలో ఎక్కువగా ఉపయోగిస్తారు.యాంజియోలైటిక్, యాంటీ కన్వల్సెంట్, ప్రశాంతత మరియు మత్తు మందు వంటి లక్షణాలు ఈ మొక్కలో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జ్ఞాపక శక్తి పెంచటం, ఒత్తిడి తగ్గించటంలో బాగా ఉపయోగపడుతుంది.
మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను నియంత్రించడానికి శంఖు చెట్టు ఆకులను విరివిగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు పూలను వంధ్యత్వం, గొనేరియ వంటి లైంగిక సమస్యలను నయం చేయటానికి వినియోగిస్తారు. ఈ శంఖు పూలను నీటిలో మరిగించి ఆ నీటిని చల్లార్చి తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.