Green Tomato Benifits: ప్రతిరోజు టమోటాలు లేకుండా వంట పూర్తవ్వదు. టమోటాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టమోటాలను ప్రతిరోజు వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు.
అయితే టమోటాలను బాగా పండిన తర్వాత ఎర్రగా ఉన్న టమోటాలను మాత్రమే వంటలలో ఉపయోగిస్తారు. కానీ పచ్చి టమోటాలు వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి అవగాహన లేక వాటిని తినటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని అపోహ పడుతుంటారు. బాగా పండిన టమోటాలతో పాటు పచ్చి టమోటాల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
సాధారణంగా బాగా పండిన టమోటాలలో విటమిన్ సి ఉంటుందనీ అందరికి తెలుసు. కానీ పచ్చి టమోటాలలో కూడా విటమిన్ సి,యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పచ్చి టమోటాలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి రోగాల బారినుండి మనల్ని కాపాడుతుంది. పచ్చి టమోటాలలో విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది.
పచ్చి టమోటాలలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం వల్ల కంటి చూపు సమస్యలు నియంత్రిస్తుంది. పచ్చి టమోటాలు తినడం వల్ల శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా అరికడుతుంది.పచ్చి టమోటాలలో సోడియం కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.
పచ్చి టమోటాలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పచ్చి టమోటాలు తినటం వల్ల శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. పచ్చి టమోటాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని సంరక్షించి ముడతలు పడకుండా కాపాడుతుంది.