Drumstick Benifits:ప్రకృతిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి. ఆకుకూరలు కూరగాయలు మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. ప్రతి ఆకు కూర, కూరగాయలో వివిధ రకాల పోషక విలువలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రకృతిలో సహజంగా లభించే కొన్ని ఆకుకూరల వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అటువంటి వాటిలో మునగాకు ఒకటి. మునగాకు వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
సాధారణంగా మునగ కాయలతో అనేక రకాల వంటలు చేసుకుంటారు. చాలా మంది మునగకయాలను మాత్రమే వంటలలో ఉపయోగిస్తారు.కానీ మునగ కాయలే కాకుండా మునగ ఆకుల లో కూడా శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మునగ ఆకులలో అనేక యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, క్యాల్షియం, పొటాషియం, ఐరన్ విటమిన్ ఏ, సి, బి మరియు మెగ్నీషియం అధిక మోతాదులో లభిస్తాయి. మునగ ఆకులను ఆయుర్వేదంలో అనేక రకాల రోగాల చికిత్సకు ఉపయోగిస్తారు. మునగ ఆకులతో కూర చేసుకొని తినవచ్చు లేదా వాటిని ఎండబెట్టి వాటి పొడిని కూడా ఉపయోగించవచ్చు.
• శరీరంలో రోగాలకు కారణం వైరస్, బ్యాక్టీరియాలు. వీటి బారినపడినా కూడా త్వరగా కోలుకోవాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి ఎంతో అవసరం. మునగ ఆకులను తినడం వల్ల శరీరానికి త్వరగా రోగ నిరోధక శక్తి లభిస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎక్కువగా మునగ ఆకులను తినడం మంచిది.
• మునగ ఆకుల లో శరీరానికి మేలు చేసే ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంపొందిస్తాయి. దీనివల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మునగ ఆకుల తో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.
• బి పి తో బాధపడేవారు మునగ ఆకులతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల క్రమంగా ఆ వ్యాధి నుంచి బయట పడవచ్చు.
• మునగ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్ గుణాలు అధికంగా ఉంటాయి. ఫలితంగా రక్తంలోని చక్కెర స్థాయిని ఇవి అదుపులో ఉంచగలవు. మధుమేహ సమస్యలు ఉన్నవారు వీటిని తినవచ్చును.
• మునగాకు కొన్ని నీటిలో వేసి బాగా ఉడికించాలి. ఆ నీటిని కొంచం చల్లార్చి గర్భం తో ఉన్న వారు తాగడం వల్ల పిండం బాగా పెరగడమే కాక ఇందులో ఉన్న ఐరన్, విటమిన్స్, క్యాల్షియం బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి.
• ఒక చెంచా మునగాకు రసంలో కొంచం తేనె కలిపి తాగడం వల్ల రేచీకటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.
• మునగాకు రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం మీద మొటిమలు క్రమంగా తగ్గుతాయి.
• మునగాకులు కిడ్నీ ఆరోగ్య రక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. మునగ ఆకులను తినడం వలన కిడ్నీలోని రాళ్లను కొల్లగొట్టడమే కాదా మూత్రంలో బయటికి వెళ్ళగొట్టడానికి సహాయపడతాయి.
• మీ కడుపు ఎంత శుభ్రంగా ఉంటే మీరు అంత తక్కువ అనారోగ్య సమస్యల బారిన పడతారు. మునగాకు తినడం వల్లమలబద్దక సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.