Health Tips: ప్రతిరోజు శొంఠి పొడి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

HealtheTips: సాధారణంగా మన భారతదేశంలో శొంఠిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. శొంఠి లో ఉండే ఎన్నో ఆయుర్వేద గుణాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ప్రతి రోజు ఏదో ఒక విధంగా శొంఠి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి అల్లం పాలలో బాగా ఉడికించి ఎండబెట్టి తర్వాత సొంటి తయారవుతుంది. బాగా ఎండబెట్టి నేతిలో వేయించి దానిని పొడి చేసి ఇ నిల్వ చేయవచ్చు.

ముఖ్యంగా శీతాకాలంలో వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు నివారించడంలో సొంటి ఎంతో ఉపయోగపడుతుంది. సొంటి పొడి ని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలిపి తాగటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

అధిక బరువు సమస్య ఉన్నవారు ప్రతిరోజు సొంటి పొడి కలిపిన పాలు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించి అధిక బరువు సమస్య నుండి విముక్తి కలిగిస్తాయి. ప్రతి రోజు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి అందులో సొంటి పొడి, తేనె కలపాలి. ఆ నీరు కొంచెం చల్లారిన తర్వాత ఖాళీకడుపుతో తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడి అజీర్తి, మలబద్ధకం, గ్యాస్టిక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.