రాత్రిపూట బాగా దురదలు పెడుతున్నాయా… ఈ సమస్య ఉన్నట్టే?

రాత్రిపూట కాళ్లు చేతులు దురద పెడుతుంటాయి. ఈ లక్షణాలు కాలేయ వ్యాధికి సంబంధించినవి. కాలేయ వ్యాధి సోకినప్పుడు తరచూ ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల వీటిని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించటం చాలా అవసరం. జీవనశైలి ఆహారపు అలవాట్లలో మార్పులు రావటం వల్ల ప్రస్తుత కాలంలో అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. అటువంటి సమస్యలలో ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఒకటి. ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ వ్యాధి సోకినప్పుడు మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

మన శరీరంలో కాలేయం ఒక ప్రధానమైన అవయవం. మనం తిన్న ఆహారం నుండి పోషకాలను అన్ని శరీర భాగాలకు అందించడంలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువమంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్య వచ్చినప్పుడు మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో ఇలా కాళ్ళు, చేతులు దురద పెట్టడం కూడ ఫ్యాటీ లివర్ వ్యాది లక్షణాలలో ఒకటి. ఈ వ్యాధి సోకినప్పుడు ఆకలి మందగించడం, అజీర్తి, కాలేయం వాపు, కాళ్లు చేతులు దురద పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ ఫ్యాటీ లివర్ వ్యాధి సోకినప్పుడు శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయి పెరిగి చర్మం మీద చిన్నచిన్న స్పైడర్ వెబ్ లాంటి గుర్తులు కనిపిస్తాయి. దీనిని స్పైడర్ ఆంజియోమాస్ అంటారు. ఇలాంటి గుర్తులు కనిపించినప్పుడు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు ఇవి ఆరోగ్యకరమైన లివర్ సంకేతం. కొన్ని సందర్భాలలో చర్మం మీద నీలిరంగు దద్దుర్లు కనిపిస్తాయి. ఇలాంటి నీలిరంగు దద్దుర్లు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి.అంతేకాకుండా ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ముఖ్యంగా వీరు తినే ఆహారం విషయంలో చాలా మార్పులు చేసుకోవాలి. అధిక కేలరీలు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటూ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.పైన వివరించిన లక్షణాలలో మీలో ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.