Health Tips: మీ చెవులలో రింగుమనే శబ్దాలు వినిపిస్తున్నాయ? ఐతే మీకు ఈ సమస్య ఉన్నట్టే..!

Health Tips: ప్రస్తుత కాలంలో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కంటి చూపు సమస్యలు, వినికిడి సమస్య ఎలా ఎన్నో రకాల సమస్యలు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరిని వేధిస్తున్నాయి. ఈమధ్య వాహనాల రద్దీ పెరిగి చెప్పాలి పెరగటం వల్ల వినికిడి సమస్య ఎక్కువ వేధిస్తోంది. వినికిడి సమస్య మొదలైనప్పుడు మన చెవులలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా కొంతమంది చెవులలో కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపిస్తుంటాయి. శైలు రింగు రింగు అనే శబ్దాలు, ఈల వేస్తున్నట్టు, పాము బుసల శబ్ధం ఇలా రక రకాలుగా వినిపిస్తుంటాయి. దీనినే టన్నిటస్ అని అంటారు. కొందరికి ఇలాంటి శబ్దాలు ఒక చెవిలో విపిస్తే.. మరి కొందరికి మాత్రం రెండు చెవులలో వినిపిస్తాయి. ఈ సమస్య గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.గులిమి పేరుకుపోవటం, సైనస్ ఇన్ఫెక్షన్, హార్మోన్ల మార్పులు, థైరాయిడ్, చెవికి దెబ్బతగలటం, అలసట,మెదడు వాపు, గవద బిళ్లలు వంటి సమస్యల వల్ల ఇలా జరుగుతుంది.

ఈ టన్నిటస్ నీ కనుగొనటానికి కొన్ని రకాల వినికిడి పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఈ సమస్య కనుగొనడానికి ఇంపిడెన్స్‌ ఆడియోమెట్రీ, ప్యూర్‌టోన్‌ ఆడియోమెట్రీ పరీక్షల ద్వారా కర్ణభేరి వెలుపల, వెనక మధ్య చెవిలో ఇన్‌ఫెక్షన్‌, సమస్యలను గుర్తించవచ్చు. పరీక్షల అనంతరం సమస్య తీవ్రత బట్టి అందుకు సంబంధిన చికిత్స డాక్టర్లు అందిస్తారు.