Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చు…!

Health Tips: ప్రస్తుతకాలంలో అందర్నీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలలో క్యాన్సర్ సమస్యలు ప్రధానమైనవిగా పరిగణించవచ్చు. ఈ మధ్య కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా అనేక రకాల క్యాన్సర్ వ్యాధులు ప్రజలను వేధిస్తున్నాయి. అటువంటి క్యాన్సర్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది. ఈ క్యాన్సర్ వ్యాది వచ్చిన వెంటనే గుర్తించకుండా ఆలస్యం చేయటం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా సకాలంలో ఈ వ్యాధిని గుర్తించడం వల్ల చికిత్స అందించి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి వ్యాపించినప్పుడు శరీరంలో కనిపించే లక్షణాలు ఆధారంగా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు ఎటువంటి జలుబు, దగ్గు సమస్యలు లేకున్నా కూడా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి.

• లంగ్ క్యాన్సర్ ఉన్నవారిలో తరచూ ఛాతి నొప్పి, గొంతు నొప్పి,కడుపునొప్పి, గొంతు మారిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు లంగ్ క్యాన్సర్ గా అనుమానించవచ్చు.

•లాంగ్ క్యాన్సర్ తో బాధపడే వారి చేతి వేళ్ళు, మొఖం ఉబ్బిపోయినట్టు వాపు వస్తాయి. అలాగే కొంచెం ఒక చిన్న కూడా శ్వాస తీసుకోవటంలో చాలా ఇబ్బంది ఉంటుంది.

ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం వహించకుండా ముందు జాగ్రత్తగా డాక్టర్ను సంప్రదించి అన్ని పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ అని నిర్ధారణ అయితే సరైన చికిత్స తీసుకోవటం చాలా అవసరం.