Omicron: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అది ఒమిక్రాన్ కావచ్చు జాగ్రత్త..!

Omicron: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటి మీద దాడి చేసి అతలాకుతలం చేసింది. కరోనా కొత్త వేరియంట్లు ఒక్కొక్కటిగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఈ కొత్త వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందడం వల్ల ఇప్పటికీ చాలా దేశాలు లాభం ప్రకటించాయి. భారత దేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయి. కరోనా ఒక్కొక్క వేరియంట్ లక్షణాలు ఒక విధంగా ఉన్నాయి. ప్రస్తుతం అందరిని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఒమిక్రాన్ లక్షణాలు గురించి తెలుసుకుందాం .

లండన్‌ కింగ్స్‌ కాలేజీ, హెల్త్‌ సైన్స్‌ కంపెనీ ZOE సంయుక్తంగా పరిశోధన నిర్వహించి ఒమిక్రాన్ లక్షణాలపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఒమిక్రాన్ సోకిన వారిలో దగ్గు , జలుబు , తలనొప్పి , జ్వరం , గొంతు నొప్పి వంటి సమస్యలతోపాటు చర్మం మీద తీవ్రస్థాయిలో దద్దుర్లు , దురదలు ఉంటాయని వెల్లడించారు . ఈ లక్షణాలు వెనక మీలో కనిపిస్తే అవి ఒమిక్రాన్ లక్షణాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఒక వ్యక్తికి ఒమిక్రాన్ సోకిందా లేదా అని తెలియాలంటే చర్మంలో వచ్చే మార్పులను బట్టి నిర్ధారించవచ్చు . ఆన్ లైన్ ద్వారా సైంటిస్టులు రీసెర్చ్ చేయగా ఒమిక్రాన్ సోకిన 12 వేల మందిలో దద్దుర్లు గుర్తించారు . కరోనా సోకిన ప్రతి ఐదు మందిలో ఒకరికి ఈ దద్దుర్లు కనిపించాయి . అందువల్ల దీనినీ ఒమిక్రాన్ లక్షణాలలో ప్రథమ లక్షణంగా గుర్తించవచ్చు . ZOE యాప్‌ నిర్వహించిన అధ్యయనంలో దాదాపు 2,500 కేసుల ఆధారంగా ప్రాథమిక డేటాను పరిశీలించగా.. డెల్టా కంటే ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతుందని , డెల్టా కంటే ఒమిక్రాన్ తేలికపాటిదని నిర్ధారణ అయింది .

ముఖ్యంగా శీతాకాలంలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి . ఈ శీతాకాలంలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి .ఒమిక్రాన్ బారిన పడకుండా ఉండాలంటే దగ్గు , జలుబు వంటి సాధారణ లక్షణాలు ఉన్నప్పుడే సరియైన పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాటిని అరికట్టవచ్చు . ఎల్లప్పుడూ మాస్కులు ధరిస్తూ , సామాజిక దూరం పాటించాలి . అత్యవసరం అయితే తప్పా ఇంటి నుండి బయటికి వెళ్లకపోవటం చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ చేతులను పరిశుభ్రంగా కడుగుతూ.. శానిటైజర్ ఉపయోగిస్తూ ఉండాలి . ఈ జాగ్రత్తలు పాటించటం వల్ల ఒమిక్రాన్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు .