Health Tips: మీకు ఆత్రుత ఎక్కువగా ఉంటుందా?దానిని అదుపు చేయటానికే ఈ ఆహార పదార్థాలు..

Health Tips:ప్రస్తుత కాలంలో అందరూ సంపాదన వేటలో పడి విశ్రాంతి లేకుండా పని చేస్తూ ఉంటారు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలామంది ఏవైనా పనులు చేసేటప్పుడు ఆత్రుతతో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. పరీక్షల ముందు కానీ, పరీక్షల తర్వాత వచ్చే ఫలితాల గురించి విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటారు. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లు ఉన్నవారు కూడా అనవసరంగా ఒత్తిడికి లోనవుతుంటారు.జంక్ ఫుడ్ తినడం, కార్బోహైడ్రేట్లు, ఉప్పు అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది అని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల కూడా యాంగ్జైటి తగ్గుతుంది అని తెలిపారు. ఎటువంటి ఆహార పదార్థాల వల్ల యాంగ్జైటి తక్కువ అవుతుందో ఒక సారి చదివేయండి.

ఆకుకూరలు: ఆకుకూరలు శరీరానికి ఎంతో మేలు కలిగిస్తాయని అందరికీ తెలుసు. రోజూ తినే ఆహారంలో ఆకుకూరలను తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆకు కూరలలో కెరోటినాయిడ్స్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటాయి. ఆకుకూరల వల్ల శరీరం మీద ఒత్తిడి తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.

వెల్లుల్లి: వెల్లుల్లి లో కాపర్, ఐరన్, పొటాషియం, విటమిన్ బి6, బీ1, పీచు పదార్థాలు అధికంగా ఉండటమే కాకుండా వీటిని తింటే శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వెల్లుల్లిని కరెక్షన్ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్త పోటు ను అదుపులో ఉంచి శరీర ఒత్తిడిని తగ్గిస్తుంది.

పెరుగు: పెరుగులో మంచి బ్యాక్టీరియా అధిక పాలలో లభిస్తుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వలన శరీరం మంచి బ్యాక్టీరియాను అందించి ఒత్తిడిని దూరం చేస్తుంది.

డార్క్ చాక్లెట్లు: చాలామంది చాక్లెట్లను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే సాధారణంగా మార్కెట్లో దొరికే చాక్లెట్స్ కన్నా డార్క్ చాక్లెట్స్ లో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి మీ శరీరాన్ని అధిక ఒత్తిడికి గురి కాకుండా కాపాడతాయి. రక్త సరఫరా చేయడంలో తోడ్పడతాయి.

సాల్మన్ ఫిష్: చేపలు తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. సాధారణ చేపల కంటే సాల్మన్ చేపల లో విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు దీని ద్వారా లభిస్తాయి. ఎక్కువగా యాంగ్జైటి కి గురయ్యే వారికి సాల్మన్ ఫిష్ ను తినడం వలన ఉపశమనం కలుగుతుంది.

డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ మన యొక్క శరీర ఆరోగ్యం పైన ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. డ్రై ఫ్రూట్స్ ను రెగ్యులర్ గా తినడం వలన ఎన్నో అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. ఇది శరీరాన్ని ఎక్కువ ఒత్తిడికి లోనవకుండా కాపాడుతుంది.

ఈ ఆహార పదార్థాలను మీ డైట్ లో భాగంగా చేసుకోవడమే కాకుండా, యోగా, ధ్యానం వంటి వాటిని చేయడం వల్ల కూడా ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తాయి.