Health Tips: ఆధునిక జీవనశైలిలో మార్పుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మూడింట ఒక వంతు ప్రజలు అధిక రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) లేదా హైపర్ టెన్షన్ సమస్య తో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు సమస్యల వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. తగిన మోతాదులో నీరు తీసుకోకపోవడం, సరైన ఆహరం తీసుకోకపోవడం, అధిక ఒత్తిడి కారణంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు సరైన ఆహరం తీసుకోవడం వల్ల దానిని కొంచెం అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. రక్త పోటు సమస్య ఉన్నవారు ఆహరంలో పొటాషియం మోతాదు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో ఉప్పు ను పూర్తిగా తగ్గించాలి. అయితే బీపీ సమస్య ఉన్నవారు టీ తాగాల వద్ద అన్న సందేహం లో ఉంటారు.
సాధారణంగా మనలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం రక్త పోటు సమస్యలు ఉన్నవారు కూడా టీ తాగటం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ హైబీపీ సమస్యతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు టీ తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైబీపీ ఉన్నవారు ఆందోళన, ఒత్తిడి ఉంటే టీ తాగకూడదు. హైబీపీ ఉన్నవారికి ఎసిడిటీ సమస్య ఉన్నట్లయితే టీ తాగకపోవడం మంచిది. ఇలాంటి వారు టీ తాగితే రక్తపోటు అధికం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా కాళీ కడుపుతో టీ అధికంగా తాగడం వలన పొట్ట, ఛాతిలో మంట వస్తుంది.
అధిక రక్తపోటుతో బాధపడేవారు కెఫిన్ ను ఎక్కువగా తీసుకోకూడదు. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు బాధితులకు హాని కలుగుతుంది. తినే ఆహారంలో సోడియం, ఉప్పు ఉండటం వల్ల రక్తపోటు అదుపులో లేకుండా పోతుంది. ఉప్పును తక్కువ తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.ఊరగాయలు, ఫ్రైడ్ రైస్, ఇతర వేపుడు కూరల వల్ల బిపి పెరుగుతుంది. బీపీని అదుపులో ఉంచుకోవాలంటే తప్పనిసరిగా వాకింగ్, వ్యాయామం, ప్రాణాయామం వంటివి చేయటం మంచిది.
రక్తపోటు సమస్యలు ఉన్నవారు టీ తాగవచ్చు, కాకపోతే తగిన పరిమాణంలో తీసుకోవడం మంచిది.