సాధారణంగా పది మందిలో 8 మంది కాలు మీద కాలు వేసుకుని కూర్చొని అలవాటు ఉంటుంది.వీరు ఏదైనా ఆఫీసులో ఉన్న లేదా ఎక్కడికి వెళ్లినా కూర్చున్నప్పుడు తప్పనిసరిగా కాలుపై కాలు వేసుకుని కూర్చుని ఉంటారు.ఇలా కూర్చోవడం వారికి అలవాటుగాను అలాగే ఎంతో సౌకర్యవంతంగానో ఉంటుంది అయితే ఇలా కూర్చోవడం వల్ల ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇలా కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు వెల్లడించారు. మరి ఆ అనారోగ్య సమస్యలు ఏమిటి అనే విషయానికి వస్తే…
మనం కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల మన రక్త ప్రసరణ వ్యవస్థ పై అధిక ప్రభావం పడుతుంది తద్వారా తొడల భాగంలో అధిక బరువు పెరగడం అలాగే కాళ్లు ఉబ్బిపోవడం వంటివి జరుగుతాయి. కొన్నిసార్లు రక్తప్రసరణ సరిగా జరగక మనం నడవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా తరచూ ఎక్కువ గంటల పాటు కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి, మోకాలి నొప్పి, పాదాలలో తిమ్మిరి కలగడం వాటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీలైనంతవరకు సాధారణ పొజిషన్లో కూర్చోవడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఈ విధంగా కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల మన శరీరంలో ఉండే పెల్విక్ కండరాలు బలంగా తయారవుతాయి. తద్వారా తొడలు అధిక బరువును కలిగి ఉంటాయి. అందుకే ఇలా కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం తగ్గించి రోజూ స్ట్రెచింగ్, ఎక్సర్ సైజ్, గేమ్స్ వంటి యాక్టివిటీస్ చేయండి. ఇలా చేయటం వల్ల మన శరీరం మొత్తం రక్తప్రసరణ సాఫీగా సాగి ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది.