భరించలేని వెన్నునొప్పితో బాధ పడుతున్నారా.. చెక్ పెట్టే క్రేజీ చిట్కాలు ఇవే!

ఈ మధ్య కాలంలో ఆఫీస్ లలో కూర్చుని ఉద్యోగాలు చేసే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఇలా ఆఫీస్ లో కూర్చునే వాళ్లలో ఎక్కువమందిని వెన్నునొప్పి సమస్య వేధిస్తోంది. భరించలేని వెన్నునొప్పితో బాధ పడేవాళ్లు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కొన్ని సమస్యలను అధిగమించవచ్చు. వయస్సు పెరిగే కొద్దీ వెన్నునొప్పి సమస్యతో బాధ పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

జీవనశైలిలో మార్పుల వల్ల చాలామంది వెన్నునొప్పి బారిన పడుతున్నారు. దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వెన్నెముక లోపల మృదులాస్థి సన్నబడడం, వెన్నుపాము కుంచించుకుపోవడం వల్ల ఎక్కువమందిని ఈ సమస్య వేధిస్తుంది. సయాటికా, గాయాలు, పడిపోవడం, పగుళ్ల కార‌ణంగా చాలామందికి విపరీతమైన వెన్నునొప్పి వేధించే ఛాన్స్ ఉంటుంది.

ఎక్కువ మొత్తం బరువులను ఎత్తడంతో పాటు గంటల పాటు ఒకే భంగిమలో కూర్చోవడంతో పాటు శ‌రీరాన్ని అతిగా సాగ‌దీయడం వల్ల వెన్నునొప్పి సంబంధిత సమస్యలు వేధిస్తాయి. వెన్నునొప్పి వల్ల అకస్మాత్తుగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. వెన్నునొప్పి సమస్యతో బాధ పడేవాళ్లలో చాలామందిని కాళ్లలో నొప్పి, మూత్రవిసర్జనలో ఇబ్బందులు లాంటి సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది.

ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ చేయించుకోవడంతో పాటు వెన్నునొప్పికి తగిన మందులు వాడటం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. వెన్ను నొప్పి ఉన్నవాళ్లు ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిది. వెన్ను నొప్పి విషయంలో నిర్లక్ష్యం చేయడం ఏ మాత్రం మంచిది కాదు.