వెన్ను నొప్పి సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో వెన్ను నొప్పి దూరం!

ప్రస్తుత కాలంలో ఎక్కువమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో వెన్ను నొప్పి ఒకటి. వెన్ను నొప్పితో బాధ పడేవాళ్లు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. మంచంపై, కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చుంటే వాళ్లలో కోర్ కండరాలు బలహీనపడే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా జరగడం వల్ల వెన్నెముక డిస్క్ లు దెబ్బ తినే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

శారీరక శ్రమ చేయడం ద్వారా వెన్ను నొప్పి శాశ్వతంగా దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. యోగ, పిలేట్స్, స్విమ్మింగ్ చేయడం ద్వారా కూడా వెన్ను నొప్పికి నిదానంగా చెక్ పెట్టవచ్చు. కంప్యూటర్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం పని చేయడం కూడా వెన్నెముకపై ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. శరీరాన్ని సాగదీయడం ద్వారా కూడా ఈ సమస్య దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

ఎర్గోనామిక్ వర్క్ స్టేషన్ లు వీపు, మెడపై ఒత్తిడిని తగ్గించే విషయంలో తోడ్పడతాయి. స్క్రీన్ సమయం నుంచి తప్పకుండా విరామం తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఈ తరహా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వెన్ను నొప్పి మరీ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. వెన్ను నొప్పి విషయంలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు.

ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు అయితే ఉండవు. వెన్ను నొప్పి మరీ ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించి చికిత్స చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.