Corona Test: ఇంట్లో కరోనా టెస్ట్ చేసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే..!

Corona Test:గడిచిన రెండు సంవత్సరాలుగా కరోనా వలన ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి నుండి సంక్రమిస్తుందో, ఎలా సంక్రమిస్తుందో తెలియక ప్రభుత్వ ఆదేశాల మేరకు చాలా మంది ఇంటి వద్దనే ఉండి పోయారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయాల్లో పెద్ద ప్రళయమే సృష్టించింది. థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ రూపంలో కరోనా వైరస్ విజృంభించింది. అయితే మునుపటి వేవ్ లతో కంపేర్ చేస్తే దీని వలన జరిగిన ప్రాణ నష్టం చాలా తక్కువ. ప్రభుత్వాల అప్రమత్తత వలన, వీలైనంత ఎక్కువగా వ్యాక్సినేషన్ చేయడం వలన థర్డ్ వేవ్ ఎక్కువ ప్రభావం చూపలేదని చెప్పుకోవచ్చు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు ఎంతో ముందు చూపుతో జాగ్రత్త పడ్డాయి. మొదట్లో కరోనా టెస్ట్ చేయించుకోవడానికి ఒక కిలోమీటర్ లైన్లో నిల్చొని టెస్ట్ చేయించుకోవాల్సిన పరిస్తితి ఉండేది. అయితే ఇప్పుడు రాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులోకి తెచ్చాయి ప్రభుత్వాలు. వీటి వలన ఇంటి వద్ద ఉండే కరోనా టెస్ట్ చేసుకోవచ్చును. తొలుత ఇవి తక్కువ మోతాదులో లభించాయి, అయితే ఇప్పుడు ఉత్పత్తి బాగా పెరిగిపోయి కిట్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. తాజా రాపిడ్ కిట్స్ తో చాలా మంది ఇంటి వద్దనే కొంచెం అనుమానం వచ్చినా కూడా టెస్ట్ చేసుకుంటున్నారు. అయితే వీటికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు సలహా ఇస్తున్నారు. కరోనా సోకిన తర్వాత కనీసం రెండు రోజుల వరకు రాపిడ్ టెస్ట్ కిట్లు వైరుస్ ను గుర్తించలేవు. మీకు అనుమానం కలిగిన మూడు రోజుల తర్వాత టెస్ట్ చేసుకుంటే ఫలితం లభిస్తుంది అని డాక్టర్లు సూచిస్తున్నారు.

• కరోనా టెస్ట్ కిట్లను రిఫ్రిజిరేటర్ లో అస్సలు ఉంచకూడదు.
• టెస్ట్ కి ఉపయోగించే ముందు వాటి ఎక్స్పిరీ డేట్ చెక్ చేసుకోవాలి.
• టెస్ట్ చేసుకునే ముందు కవర్ మీద ఉన్న సూచనలను చదవాలి
• నాజిల్ ను స్వాబ్ చేసే ముందు ముక్కుని బాగా చీదాలి
• స్వాబ్ ను నిమ్మదిగా 2-3 సెంటిమీటర్లు ముక్కు రంధ్రం లోకి పెట్టి, దాని మీద సూచించిన అన్ని సార్లు తిప్పాలి.
• లాలాజలము తో చేసే కరోనా టెస్ట్ కు అరగంట ముందు నుండి తినడం, తాగడం, పొగ తాగడం, పళ్ళు తోమడం, బబుల్ గమ్ నమలడం చేయకూడదు.
• కిట్ల పై C,T అనే రెండు అక్షరాలతో లైన్లు ఉంటాయి. అవి రెండూ చారలు కనిపిస్తేనే కరోనా పాజిటివ్ అని నిర్ధారించుకోవచ్చు.
• C ఉన్న చోట మాత్రమే చార కనిపిస్తే నెగటివ్ అని అర్థం.
• T మాత్రమే చార కనిపించిన, C చార కనిపించక పోయిన కూడా టెస్ట్ సరిగ్గా చేయలేదు అని అర్థం. అలా వస్తె తిరిగి మరి టెస్ట్ చేసుకోవాలి.

ఇంటి వద్దనే కరోనా టెస్ట్ చేసుకునే వారు పై జాగ్రత్తలు పాటించడం మంచిది.