Health Tips: సాధారణంగా పనస పండుని అందరూ ఇష్టంగా తింటారు. పనస పండుతో చాలామంది కూరగా కూడా చేసుకొని తింటుంటారు. పనసకాయ తినటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం ఉన్నప్పటికీ.. పనస కాయతో పాటు కొన్ని ఆహార పదార్థాలను తినటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పనసకాయ తిన్న వెంటనే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో, వాటిని తినటం వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం.
పనసకాయ తిన్న వెంటనే పొరపాటున కూడా బెండకాయలు తినటం మంచిది కాదు. పనసకాయ తిన్న వెంటనే బెండకాయలతో చేసిన ఆహార పదార్థాలు తినటం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పనసకాయ తిన్నప్పుడు బెండకాయలు తినకపోవడం మంచిది.
ప్రతిరోజు పాలు తాగటం వల్ల మన ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు లభించి రోగాల బారినుండి మనల్ని కాపాడతాయి. కానీ పనసకాయ తిన్న వెంటనే పాలు తాగటం వల్ల సోరియాసిస్, దురద, రింగ్ వార్మ్ వంటి చర్మ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
పనసకాయ తిన్న వెంటనే తేనె, బొప్పాయి, పాన్ వంటివి తీసుకోవటం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. సాధారణంగా చాలామంది పనస పండు ను తేనెలో ముంచి తింటుంటారు. ఇలా చేయటం వల్ల శరీరంలోని రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోయాయి ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ ఆహార పదార్థాలను పనస పండు తిన్న వెంటనే తీసుకోకపోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.