Jack Fruit:ఈ వేసవి కాలంలో లభించే పండ్లలో పనస పండు కూడా ఒకటి. పనస పండు ఎక్కువగా మన ఆసియా దేశాలలో వేసవికాలంలో పండుతుంది. పనస పండు తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ఈ పండు తినటం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నప్పటికీ అనుకోకండి తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తినటం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. పనస పండు తిన్న తర్వాత ఏ ఏ ఆహార పదార్థాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా పండ్లు పండ్లు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.పంచ పండు తిన్న తర్వాత వెంటనే పాలు తాగటం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పనస పండు తిన్న వెంటనే పాలు తాగటం వల్ల రింగ్‌వార్మ్, గజ్జి, దురద, తామర, సోరియాసిస్ వంటి చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సాధారణంగా కొన్ని పనస పండ్లు తీయగా లేనప్పుడు చాలా మందికి వాటిని తేనెలో ముంచి తినే అలవాటు ఉంటుంది. కానీ ఇలా పనసపండు తేనే కలిపి తినటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు పొరపాటున కూడా ఇలా చేయడం శ్రేయస్కరం కాదు.
ఇది మాత్రమే కాకుండా పనస పండు తో కలిపి తమలపాకు, రూపాయి, కిల్లి, బెండకాయ వంటి వాటిని కూడా తినకూడదు. ఇలా పనసపండు తిన్న తర్వాత పైన చెప్పిన పదార్థాలు తినటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.