Weight Loss Tips: ప్రస్తుత కాలంలో ఉన్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అటువంటి సమస్యలు ప్రథమంగా చెప్పుకొనే సమస్య అధిక బరువు. ఆరోగ్యకరమైన పౌష్టికాహారానికి బదులు జంక్ ఫుడ్ ఎక్కువ తినటానికి ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి అధిక బరువు సమస్య ఇబ్బంది పెడుతుంది. అధిక బరువును తగ్గించడానికి చాలామంది వేల రూపాయలను ఖర్చు చేసి జిమ్ కి వెళ్లి వ్యాయామాలు చేస్తుంటారు.
మరికొంతమంది ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ, డైట్ ఫాలో అవుతూ అధిక బరువును తగ్గించటానికి నానా అవస్థలు పడుతూ ఉంటారు. అయితే కొంతకాలం తర్వాత వ్యాయామాలు చేయడానికి బద్దకించి మానేస్తుంటారు. ఇలా ఎంతోమంది సన్నబడాలి అనుకున్న వారి కల కలలాగే మిగిలిపోతుంది. చాలామంది బరువు తగ్గించుకొనే క్రమంలో వారు తీసుకునే ఆహారంలో ఎక్కువగా రోటీలు తింటుంటారు. రోటీలు ఎక్కువగా తినటం వల్ల శరీర బరువు తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఇటువంటి రోటీలు తినటం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసు.
సాధారణంగా మార్కెట్లో గోధుమపిండి, మల్టీ గ్రైన్ పిండి లభిస్తుంది. గోధుమ పిండి తో చేసిన రోటీలు తినటం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తులకు గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వారికి గోధుమ పిండితో చేసిన రోటీలకు అన్న మల్టీ గ్రైన్ పిండితో తయారుచేసిన రోటీలను తినటం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. గోధుమ పిండితో పోల్చితే మల్టీగ్రెయిన్ పిండిలో గోధుమలు ,ఓట్స్,సోయాబీన్, బార్లీ వంటి అనేక రకాల చిరుధాన్యాలు మిశ్రమం ఉంటుంది. మల్టీ గ్రైన్ గోధుమపిండిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మల్టీ గ్రీన్ గోధుమ పిండితో తయారు చేసిన రోడ్లను తినడం వల్ల బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా ఈ పిండి అనేక రకాల ధాన్యాలతో చేయటం వల్ల పోషక విలువలు పుష్కలంగా ఉంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.