Health Tips:బంగాళాదుంపలు ప్రపంచంలో ప్రసిద్ది గాంచిన కూరగాయలలో ఒకటి. ఇవి భూగర్భ పంట, అంటే ఇది భూమి లోపల పండే పంట. దీని ఆకులు, కొమ్మలు నేలపైన విస్తరించి గడ్డ మాత్రం మట్టిలోపల ఉత్పత్తి అవుతుంది. ఇవి ఏడాది పొడవునా లభిస్తాయి. బంగాళాదుంపలతో చిప్స్, స్టిక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, అనేక రకాల కూరలు వంటివి తయారు చేయడంలో ప్రసిద్ది చెందినవి. బంగాళాదుంపలు కొనేటపుడు కాస్త ఎక్కువ పరిమాణంలో కొంటారు.
బంగాళాదుంపలకు ఎక్కువ సేపు ఎండ తగిలినా లేదా ఎక్కువసేపు గడ్డకట్టిన కూడా దానిమీద ఆకుపచ్చ రంగు మచ్చలు వస్తుంటాయి. దీనిని సాధారణంగా అందరూ చూసే ఉంటారు. అయితే ఇలాంటి మచ్చలు వచ్చిన బంగాళదుంపలను తినాలా వద్దా? తింటే ఏమవుతుంది అని చాలామంది సందేహిస్తుంటారు. దీని గురించి వైద్యులు ఏమంటున్నారో చూద్దాం. బంగాళాదుంపలు ఆకుపచ్చ రంగులోకి మారాయి అంటే అందులో సోలానిన్ అనే విషపదార్థం ఉంటుంది. సాధారణంగా సూర్యరశ్మి తగిలినప్పుడు బంగాళా దుంపలలో క్లోరోఫిల్ ఏర్పడడం మొదలవుతుంది. దీనిని గుర్తించే సమయానికి అందులో సొలనిన్ అనే విష టాక్సిన్స్ ఏర్పడడం ప్రారంభమవుతుంది.
బంగాళాదుంపలు కీటకాలు లేదా ఇతర జెమ్స్ నుండి తమను తాము కాపాడుకోవడానికి ఈ రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. కానీ సోలార్ అనేది మనిషి శరీరం మీద విష ప్రభావం చూపుతుంది. కాబట్టి, బంగాళాదుంపలు పచ్చ గా మారితే అసలు తినకపోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
కొంతమంది పచ్చగా ఉన్న భాగాన్ని తీసివేసి మిగిలిన భాగాన్ని తింటుంటారు, ఇలా చేయడం కూడా చాలా పెద్ద పొరపాటు. బంగాళాదుంప ఏదైనా ఒక భాగంలో సోలానిన్ ఉత్పత్తి చేసుకొని ఆకుపచ్చరంగులో మారిందంటే ఆ రసాయనం బంగాళదుంప అంతటా వ్యాపించి ఉంటుంది. ఆకుపచ్చ రంగు బంగాళాదుంపలను పిల్లలు తినటం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతారు. అదే పెద్దలు తినడం వల్ల కడుపుకు సంబంధించిన వ్యాధులు, విరేచనాలు మొదలవుతాయి.