Egg Side Effects: గుడ్లు ఎక్కువగా తింటున్నారా? షాకింగ్ విషయాలు వెల్లడించిన నిపుణులు..!

Egg Side Effects: ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవని డాక్టర్లు సూచిస్తున్నారు. గుడ్డులో మన శరీరానికి అవసరమైన అనేక రకాల పోషక విలువలు దాగి ఉంటాయి. ఇటువంటి గుడ్డును ప్రతి రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. డైటింగ్ చేసేవారు ప్రతిరోజు ఒక గుడ్డుని ఉడికించి అల్పాహారంగా తీసుకుంటారు. ఉడికించిన గుడ్ల లో ప్రోటీన్స్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఏ, వంటి మూలకాలు ఉంటాయి. ఉడికించిన కోడిగుడ్లు ఎక్కువగా తినటం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముఖ్యంగా వేసవి కాలంలో ఉడికించిన కోడిగుడ్లు ఎక్కువగా తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత అధికమవుతుంది. తద్వారా డయేరియా బారినపడే అవకాశాలు ఉంటాయి. జీర్ణ సంబంధిత సమస్యలు మొటిమలు సమస్యలు ఉన్నవారు ఎక్కువ గుడ్లు తినడం వల్ల వారి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారు కూడా ఉడికించిన కోడిగుడ్లు తినటం వల్ల అందులో ఉండే కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోయి మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

సరిగా ఉడకని కోడి గుడ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కోడి గుడ్లను సరిగా ఉడికించక పోవటం వల్ల అందులో ఉండే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఇటువంటి కోడి గుడ్లు తినడం వల్ల అజీర్తి, కడుపునొప్పి, వాంతులు, కడుపులో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల కోడిగుడ్లను బాగా ఉడికించి రోజుకు ఒకటి లేదా రెండు మాత్రమే తీసుకోవాలి. మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.