ఉల్లిపాయాలపై నిమ్మరసం వేసి తింటున్నారా..ఇది తెలుసుకోవాల్సిందే!

మన వంటకాలలో ఉల్లిపాయ వేయనిది ఏ వంట చేయరు. సాధారణంగా చాలా మందికి ఏమైనా తినేటపుడు పచ్చి ఉల్లిపాయని అన్నంతో పాటు తినే అలవాటు ఉంటుంది. రెస్టారెంట్ లో ఉల్లిపాయ నిమ్మకాయ ఇస్తుంటారు.అయితే వాటి మీద నిమ్మకాయ పిండుకొని తింటుంటాము. ఇది చాలా మందికి అలవాటు. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

ఉల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి, ఉల్లిపాయ సల్ఫర్ సమ్మేళనం, అలాగే ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శరీర బరువు తగ్గించడంలోనూ ఉల్లిపాయ చాలా ఉపయోగపడుతుంది. సాదారణంగా రోజూ తీసుకునే సలాడ్స్, వంటలలో పచ్చి ఉల్లిపాయతో కలిపి నిమ్మకాయను తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయి. పచ్చి ఉల్లిపాయ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఇటీవల జరిగిన ఒక అనాలిసిస్ ప్రకారం ఉల్లిపాయలో ప్రీబయోటిక్ ఇన్సులిన్, ఫ్రక్టోలిసాకరేట్లు ఉంటాయి, ఇవి కడుపులో మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి, దీని వల్ల ఇమ్మునిటీ పవర్ పెరుగుతుంది. ఇక ఉల్లిపాయను టమోటాతో తీసుకోవడం వల్ల కూడా మంచి ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయి. టమోటాలో లైకోపిన్ అనే సమ్మేళనం ఉంటుంది.

అయితే అందరూ పచ్చి ఉల్లిపాయను తినడం మంచిది కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఈ పద్దతి మానుకోవడం మంచిది. లేకుంటే మరిన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కి గురి కావాల్సి వస్తుంది. ఉల్లిపాయలో ఎన్నో రకాల యాంటీఆక్సిడెంట్ ఉండటం వల్ల దగ్గు జలుబు వంటి సీజనల్ వ్యాధులు నుండి మనల్ని కాపాడుతుంది. ఉల్లిపాయ, నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఉపయోగపడటమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడతాయి. చుండ్రు సమస్యలను తగ్గించడానికి కూడా నిమ్మకాయ… ఉల్లిపాయ బాగా సహాయపడుతాయి.