చపాతితో పాటు అన్నం తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు?

ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు చాలామంది ఉన్నారు. అటువంటి వారు రాత్రిపూట చపాతీలు తింటే బరువు తగ్గుతారని భావించి రాత్రి అన్నంకి బదులు చపాతి తింటున్నారు. చపాతీతో పాటు అన్నం కూడా కలిపి తింటున్నట్టు అయితే మీరు పొరపాటు చేసినట్టే. ఇలా అన్నం ,చపాతి కలిపి తినటం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా .

బరువు తగ్గటానికి చాలామంది డైట్ ను ఫాలో అవుతూ ఉంటారు. అలాగే రాత్రిపూట అన్నానికి బదులు చపాతీలు, రొట్టెలు ,ఫ్రూట్స్ లేదా ఏవైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారు. కానీ కొద్దిమంది రాత్రిపూట చపాతీ మాత్రమే తినకుండా ఒకటి ,రెండు చపాతీలు దానితోపాటు కొంచెం అన్నం కలిపి తింటుంటారు. అలా చేయటం ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నం చపాతి రెండు కలిపి తినటం వల్ల కేలరీలు తగ్గటం అటుంచితే పొట్ట బరువు పెరిగి ఒబేసిటీ సమస్యకు దారి తీస్తుంది. అన్నం,చపాతి కలిపి తినటం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. ఆస్తమాతో బాధపడేవారు ఇటువంటి పొరపాటు చేయకూడదు.

రాత్రివేళ అన్నం, చపాతీ కలిపి తినటం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణం అవుతుంది. బరువు తగ్గాలని అనుకొనే వారు ఇలా చపాతి,అన్నం కలిపి తినటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇలా తినడం వల్ల ఆరోగ్య సమస్యల మొదలవుతాయి. కనుక పొరపాటున కూడా అన్నం,చపాతీ రెండు కలిపి తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.