Health Tips: ఖర్జూరం ఎక్కువగ తింటున్నారా? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Health Tips: మనం తీసుకునే ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించి మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు. మన ఆరోగ్యానికి దోహదపడే వాటిలో ఖర్జూరం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది అనటంలో సందేహం లేదు. ఖర్జూరంలో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో రకాల పోషక విలువలు దాగున్నాయి. ఖర్జూరంలో ఫ్రక్టోజ్‌, డెక్స్‌ట్రోజ్‌, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం తినటం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ప్రతి వందగ్రాముల ఖర్జూరంలో 280 కేలరీలు ఉంటాయి. శీతాకాలంలో ఖర్జూరం ఎక్కువగా తిన్న పరవాలేదు కానీ వేసవి కాలంలో ఖర్జూరం ఎక్కువ తినడం వల్ల శరీరం వేడి చేస్తుంది.

ఖర్జూరంలో విటమిన్ ఏ, విటమిన్ బి ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి అనేక ఆరోగ్యసమస్యల నుండి మనల్ని కాపాడుతుంది
ఖర్జూరం శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచటానికి ఉపయోగపడుతుంది. మలబద్దక సమస్యతో బాధపడేవారు రాత్రిపూట ఖర్జూరాలను నానబెట్టి ఉదయం లేవగానే ఖర్జూరాలను తిని నీటిని తాగటం వల్ల వారి సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

కర్జూరంలో ఐరన్ ,క్యాల్షియం, మాంగనీస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఎముకల దృఢత్వానికి ఎంతో దోహదపడుతుంది. ఖర్జూరంలో పొటాషియం ఎక్కువగా ఉండటం మన శరీరంలో రక్తపోటు ను అదుపులో ఉంచి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది. ఖర్జూరం తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అందువల్ల వీటిని క్రమం తప్పకుండా తినటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.