Watermelon:సీజన్ కు తగ్గట్టుగా మార్కెట్లో అనేక రకాల పళ్ళు దొరుకుతుంటాయి. వేసవికాలంలో విరివిగా దొరికే పళ్ళల్లో ఒకటి పుచ్చకాయ (వాటర్ మిలన్). వేసవిలో శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది, పుచ్చకాయ తినడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడగలదు. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది, అలాగే ఆరు శాతం చక్కెర ఉంటుంది. వేసవికాలంలో పుచ్చకాయ తినడం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ రాకుండా చేయడమే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇందులో శరీరానికి మేలు చేసే అనేక రకాల విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు, పోషకాలు ఉంటాయి.
అయితే చాలామందికి పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగే అలవాటు ఉంటుంది.కానీ పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగకూడదని పెద్దలు అంటుంటారు. అవునండి అది నిజమే, పుచ్చకాయలో దాహాన్ని తీర్చగల శక్తి ఉంటుంది. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల మనం తిరిగి నీటిని తాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయి అని డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయ తిన్న వెంటనే నీటిని తాగితే శరీరంలోని నీటి శాతం ఎక్కువ అయి వాంతులు, విరేచనాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా పెరుగుతుంది.
కడుపు నొప్పి సమస్యలు ఉన్నవారు పుచ్చకాయ తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల వికారం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ బ్యాలన్స్ తప్పుతాయి. శరీరంలోని కణాల పనితీరు బలహీనపడుతుంది. పుచ్చకాయ తిన్న వెంటనే నీటిని తాగడం వలనఈ శరీరం బరువు ఎక్కడమే కాకుండా, జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పుచ్చకాయ తిన్న వెంటనే నీటిని తాగే అలవాటు ఉన్నవారు ఈ అలవాటును మానుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.