Health Tips: సాధారణంగా నీరు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. రోజుకు మూడు లేదా నాలుగు లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. మనం తక్కువ మోతాదులో నీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని చాలా మంది అపోహపడుతుంటారు. శరీరం డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉండటానికి ఎక్కువ శాతం నీరు తాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నీరు తాగే సమయం, కొన్ని పద్దతులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చాలా మంది ఆహారం తీసుకునే సమయంలో నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. లేదా ఆహారం తిన్న వెంటనే నీటిని తాగుతారు. ఇలా చేయటం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవ్వక జీర్ణ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. భోజనానికి అరగంట ముందు, భోజనం తిన్న అరగంట తర్వాత నీటిని తాగడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది ఎక్కువ మోతాదులో నీటిని తాగుతుంటారు. పరిమితికి మించి నీటిని తాగటం వల్ల దాని ప్రభావం గుండె ఆలయం ఊపిరితిత్తుల మీద ప్రభావం ఉంటుంది. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సాధారణంగా మూత్ర నమూనా లేత పసుపు రంగులో ఉన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. మోతాదుకు మించి నీరు తాగడం వల్ల మూత్రం పూర్తిగా తెలుపు రంగులో ఉంటుంది. ఇలా మూత్రం ఎరుపు రంగులో ఉన్నప్పుడు వెంటనే జాగ్రత్తపడి అధిక మొత్తంలో నీరు తాగకుండా రోజుకు మూడు లేదా నాలుగు లీటర్లు నీటిని తాగటం మంచిది.