కలబంద జ్యూస్ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!

Alovera Juice: కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. కలబందను పూర్వకాలం నుండి ఆయుర్వేదం లో కూడా వినియోగిస్తున్నారు. కలబంద మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మం , జుట్టు సంరక్షణలో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కలబందను చాలా మంది జ్యూస్ చేసుకొని తాగుతుంటారు. ఇలా జ్యూస్ చేసుకొని తాగటం వల్ల ఆరోగ్యానికి మేలు కలిగినప్పటికీ.. ఈ జ్యూస్ ఎక్కువగా తాగటం వల్ల కలిగే దుష్పరిణామాలు కూడా చాలా ఉన్నాయి. అలోవెరా జ్యూస్ ఎక్కువగా తాగటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కలబంద జ్యూస్ ప్రతి రోజూ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల అందులో ఉండే పొటాషియం మన గుండె మీద ప్రభావం చూపుతుంది. శరీరానికి అవసరమైన దానికన్నా ఎక్కువ మోతాదులో పొటాషియం లభించటం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఇతర గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కలబంద జ్యూస్ ప్రతిరోజు తక్కువ మోతాదులో తాగటం మంచిది.

కలబంద జ్యూస్ ఎక్కువ మోతాదులో తాగటం వల్ల డయేరియా, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రతి రోజు తక్కువ మోతాదులో కలబంద జ్యూస్ తీసుకోవాలి.కలబంద జ్యూస్ ఎక్కువగా తాగటం వల్ల అధిక బరువు సమస్యను తగ్గించవచ్చునని చాలామంది అపోహ పడుతుంటారు. ఎక్కువ మోతాదులో కలబంద జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గటం అటుంచితే అలర్జీ వంటి చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అప్పుడప్పుడు తక్కువ మోతాదులో కలబంద జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి శ్రేయస్కరం.