Health Tips:మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న కల్చర్ ప్రకారం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎక్కువగా మద్యపానానికి బానిసలవుతున్నారు. మొదటగా దీనిని ఫ్యాషన్ అంటూ అప్పుడప్పుడు తీసుకుంటూ అలవాటు చేసుకుంటున్నారు. నిధానంగా దీనికి పూర్తిగా బానిసలవుతున్నారు. చాలామంది చిన్న వయసులోనే దీనికి బాగా అలవాటు పడుతున్నారు. ఫలితంగా వారి ఆరోగ్యాన్ని వారే చేజేతులా నాశనం చేసుకుంటూ, చిన్న వయస్సులోనే అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆరోగ్యం దెబ్బతింటుంది అని తెలిసి కూడా ఈ అలవాటును మాత్రం మానుకోవడం లేదు.
ఆల్కహాల్ వల్ల లివర్ దెబ్బతింటుంది అని అందరికీ తెలుసు. మద్యపానం చేసే సమయం లో పచ్చి మిరపకాయలు తినడం వల్ల లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సాధారణంగా మద్యం సేవించారు స్టఫ్ కోసం వివిధ రకాల ఆహార పదార్థాలు తీసుకుంటారు. అయితే ఇవి తాత్కాలిక ఆనందం మాత్రమే కలుగచేస్తాయి. వీటికి బదులుగా ఆల్కహాల్ తాగే సమయంలో పచ్చి మిర్చి తింటే లివర్ అనారోగ్యాల బారిన పడకుండా కాపాడే శక్తి ఇందులో ఉంటుంది. ఈ చిట్కా అప్పుడప్పుడు మద్యం తాగే వారికి మాత్రమే వర్తిస్తుంది. అలాగని రోజు విపరీతంగా మద్యం సేవించేవారు… లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ పచ్చి మిర్చి తింటాము అంటే అలాంటివారికి ఎటువంటి ఉపయోగము ఉండదు.
ఆఫ్రికాలోని ప్రజలు ఆల్కహాల్ సేవించేటప్పుడు కచ్చితంగా పచ్చిమిర్చిని తీసుకుంటారట. అందుకే వారు ఎక్కువగా లివర్ సమస్యల బారిన పడరు అని ఒక అధ్యయనం తెలిపింది. పచ్చి మిరపలో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. మద్యం సేవించేటప్పుడు పచ్చి మిరప తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ మీద ప్రభావం చూపి అనారోగ్యాలకు గురి కాకుండా కాపాడతాయి.
పచ్చి మిరపకాయలు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలా అని బాటిల్లకు బాటిల్లు మద్యం సేవించి కేజీలకు కేజీల పచ్చిమిర్చి తింటాను అంటే దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దీనివల్ల ఎక్కువ ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం.