Health Tips: సాధారణంగా వేసవికాలంలో ఉష్ణోగ్రతలు భరించలేక చాలామంది చల్లటి ప్రదేశంలో ఉండటానికి, చల్ల చల్లని ఐస్ క్రీమ్ , కూల్ కూల్ డ్రింక్స్ తాగటానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచటానికి చాలామంది ఎక్కువ పానీయాలను తాగుతూ ఉంటారు. కానీ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవికాలంలో కానీ, శీతాకాలంలో కానీ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా కూల్డ్రింక్స్ తయారుచేయటానికి చక్కెర ఎక్కువ కలుపుతూ ఉంటారు. వేసవి కాలంలో అధిక మొత్తంలో తీయటి కూల్ డ్రింక్స్ త్రాగడం వల్ల శరీరంలోని రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగి పోతాయి. అందువల్ల ప్రతి రోజు అధిక మోతాదులో కూల్ డ్రింక్స్ తాగటం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
కూల్ డ్రింక్స్ లో ఎక్కువ చక్కెర ఉపయోగించి తయారు చేయటం వల్ల ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడినా కూడా అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చి పెడతాయి. కూల్ డ్రింక్స్ లో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తాగితే అధిక బరువు పెరుగుతారు. అందువల్ల వీటికి దూరంగా ఉండటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
కూల్ డ్రింక్స్ లో ఫాస్పోరిక్, కార్బోనిక్ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. తరచూ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగటం వల్ల వాటి చల్లదనానికి, వాటిలో ఉండే ఆమ్లాలకు క్రమంగా దంత సమస్యలు తలెత్తుతాయి.
కూల్ డ్రింక్స్ లో ఫ్రాక్టోస్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది లివర్ లో పేరుకుపోతుంది. తద్వారా లివర్ లో అధిక మొత్తంలో లో కొవ్వు పేరుకుపోయి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.