Health Tips: వేసవికాలంలో బీర్ ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..!

Health Tips: ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు ముసలి వారు అనే తేడా లేకుండా అందరూ మద్యపానానికి బాగా అలవాటు పడ్డారు.చాలా మంది ఆల్కహాల్ కాకుండా బీర్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. బీరు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలామంది అపోహ పడుతుంటారు. కాకపోతే బీర్ వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఎండ వేడి భరించలేక చల్లటి బీర్ తాగి శరీర ఉష్ణోగ్రతను తగ్గించవచ్చని చాలా మంది భ్రమ పడుతుంటారు. వేసవికాలంలో బీర్ ఎక్కువగా తాగటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత ను తగ్గించడానికి చల్లటి బీర్ తాగుతుంటారు. కానీ బీర్ లో ఉండే ఆల్కహాల్ మన శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగేలా చేస్తుంది. సాధారణంగా వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్ కి గురవుతుంది. బీర్ ఎక్కువగా తాగటం వల్ల అందులోని ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించి శరీరంలో నీటిని చెమట రూపంలో బయటకు వెళ్ళేలా చేసి డీహైడ్రేషన్ బారిన పడేలా చేస్తుంది.

సాధారణంగా వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు వాంతులు, విరేచనాలు, గ్యాస్టిక్ సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. కనుక ఇటువంటి తమ సమస్యలతో తరచూ ఇబ్బంది పడేవారు బీర్ తాగటం వల్ల ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించుకోవడానికి, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవటానికి బీర్ తాగడానికి బదులు మజ్జిగ, రాగి జావ , కొబ్బరి నీళ్ళు వంటివాటిని తాగుతూ నీటి శాతం ఎక్కువగా ఉన్న కర్బూజ, పుచ్చకాయ వంటి వాటిని తరచూ తింటూ ఉండాలి.