Health Tips: ఈ సమస్యలు ఉన్న వారు బొప్పాయి తింటే ఎం జరుగుతుందో తెలుసా..?

Health Tips:ఆకుకూరలు ,కూరగాయలు ,పండ్లు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో ఉపయోగపడతాయి. బొప్పాయి పండు వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయి తో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా చర్మ సంబంధిత సమస్యలను కూడా తగ్గించవచ్చు. బొప్పాయి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంత మంది మాత్రం వీటికి దూరంగా ఉండటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. బొప్పాయిలో సైనోజెనిక్ గ్లైకోసైడ్ అమినో యాసిడ్స్‌ ఉండటం వల్ల గుండె దడ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గుండె దడ ఉన్న వారు బొప్పాయి కి దూరంగా ఉండాలి.

ముఖ్యంగా గర్భవతులు బొప్పాయి పండు అసలు తినకూడదు. బొప్పాయి పండు తినటం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందువల్ల అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రూపాయి పండు లో ఎందుకు లేటెక్స్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఇది గర్భాశయ మీద ప్రభావం చూపి నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే ప్రమాదం ఉంటుంది.

రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండలో షుగర్ వ్యాధితో బాధపడే వారు బొప్పాయి పండు తినడం వల్ల శరీరంలో రక్తంలోని చక్కెర స్థాయిలు మరింత తగ్గి పోయే ప్రమాదం ఉంటుంది.

కిడ్నీలో రాళ్లు ఉన్న వారు బొప్పాయి పండు తినడం వల్ల సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంది. బొప్పాయి పండు తినటం వల్ల క్యాల్షియం ఆక్సలేట్ ఉత్పత్తి అయ్యి కిడ్నీ లో రాళ్ళు ఏర్పడి వాటి పరిమాణం కూడా పెరుగుతుంది. ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు బొప్పాయి కి దూరంగా ఉండటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.