Health Tips: ఈ సమస్యలు ఉన్న వారు ఎక్కువగా బంగాళదుంపలు తింటున్నారా? జాగ్రత్త సుమీ…!

Health Tips: ఆకుకూరలు కూరగాయలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బంగాళదుంపలు ఇష్టపడని వారంటూ ఉండరు. బంగాళాదుంపలు ఎక్కువ రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. బంగాళా దుంపలలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, విటమిన్ వంటి ఎన్నో రకాల పోషక విలువలు ఇమిడి ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు బంగాళదుంపలతో చాలా రకాల వంటకాలు తయారు చేసుకుని ఇష్టంగా తింటుంటారు.కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం బంగాళదుంపలను అతిగా తినటం వల్ల ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ అనారోగ్యసమస్యలు ఉన్నవారి బంగాళాదుంపలకు దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడేవారు బంగాళాదుంపలకు దూరంగా ఉండటం చాలా మంచిది.బంగాళదుంప లో ఫ్రెండ్ పదార్థం అధికంగా ఉండటం వల్ల శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల రక్త సరఫరా సరిగా జరగదు. అందువల్ల అనేక గుండె సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో తరచూ అందరిని వేధిస్తున్న సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఒకటి.ఈ సమస్య ఉన్న వారు అధిక మొత్తంలో బంగాళదుంపలు తినటం వల్ల వారి సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువైనపుడు చాతి నొప్పి కడుపు నొప్పి నడుము నొప్పి వంటి సమస్యలు తరచూ ఎదుర్కోవాల్సి వస్తుంది.

ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధ పడేవారు బంగాళదుంపలను తినకపోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. బంగాళాదుంపలలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనే పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరిగేలా చేస్తుంది. తద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. బీపీ సమస్యతో బాధపడే వారు కూడా అప్పుడప్పుడు మాత్రమే బంగాళదుంపలను తీసుకోవాలి లేదంటే వారి సమస్య ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.