Health Tips: పల్లీలు…. వీటిని వేరు శనగ కాయలు, రాయలసీమలో కొన్ని చోట్ల చెనక్కాయలు అని కూడా అంటారు. వీటిని ఆహార పదార్థాలు, వంటకాలలో వినియోగిస్తుంటారు. ఇవి తినేందుకు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా.. ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిలో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ, బి, ఫైబర్ లతోపాటు అత్యధిక మోతాదులో పోషకాలు లభిస్తాయి. ప్రతిరోజూ గుప్పెడు పల్లీలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రతిరోజూ గుప్పెడు పల్లీలు తినటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందని ఎన్నో అధ్యయనాలు వివరిస్తున్నాయి. కేవలం 100 గ్రాములు పల్లెలలో 567 గ్రాముల క్యాలరీలు ఉంటాయి. అయితే ఇవి శరీర ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా సరే కొంతమంది మాత్రం వీటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…
ఈ మధ్య కాలంలో అనేక మంది హైబీపీ బారిన పడుతున్నారు. ఈ సమస్యతో బాధపడే వారు వీలైనంత తక్కువగా పల్లీలను తినాలి, లేకపోతే రక్తపోటు స్థాయి పెరగడమే కాకుండా….. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. పల్లీల లో పొటాషియం తో పాటు సోడియం కూడా ఉండటం వల్ల ఇవి బిపిని అధికం చేస్తాయి.
కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు కూడా వేరుశనగ లను తినడం తగ్గించడం మంచిది. వేరుశెనగ లు లెక్తిన్ ను కలిగి ఉంటాయి, ఇవి కీళ్ల నొప్పులను అధికం చేయడంలో దోహదపడతాయి. అలాగే కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వేరుశెనగ లను తినకపోవడం మంచిది. ఒకవేళ వారికి తినాలనిపిస్తే తక్కువ మోతాదులో తినడం శ్రేయస్కరం. పల్లీ లలో ఉండే కొన్ని రకాల మూలకల వల్ల కాలేయ సంబంధిత వ్యాధులను అధికం అవుతాయి.
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు, థైరాయిడ్ నివారణ కు మందులు వాడేవారు, ఊబకాయం సమస్యతో బాధపడేవారు పల్లీలను ఎంత తక్కువగా తింటే అంత మంచిది. లేకపోతే సమస్యలు అధికమవుతాయి.