Temple: చాలామందికి ప్రతి రోజు ఉదయం లేవగానే స్నానం ఆచరించి ఇంట్లో పూజలు చేసి గుడికి వెళ్ళడం అలవాటు గా ఉంటుంది. ఇలా ప్రతిరోజు దైవ దర్శనం చేసుకునే అలవాటు ఉండటం వల్ల పుణ్యం లభించడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ కొంతమంది గుడికి వెళ్ళినప్పుడు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలాంటి పొరపాట్లు చేయటం వల్ల గుడికి వెళ్ళిన లభించకపోగా సకల పాపాలు వెంటాడుతాయి. గుడికి వెళ్ళినప్పుడు చేయకూడని కొన్ని పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటి నుండి బయలుదేరినప్పుడు చాలామంది చెప్పులు వేసుకుని గుడికి వెళ్తుంటారు. గుడికి వెళ్లగానే కొంతమంది చెప్పులు వదిలి సరాసరి గుళ్లోకి ప్రవేశిస్తారు. అలా కాళ్ళు కడుక్కోకుండా గుళ్లోకి ప్రవేశించడం వల్ల పాపం వస్తుంది. అందువల్ల చెప్పులు బయట వదిలి కాళ్ళు కడుక్కొని గుడిలోకి ప్రవేశించాలి. గుడి లోకి ప్రవేశించిన వెంటనే క్షేత్రపాలకుడు కి నమస్కారం చేసుకొని ధ్వజస్తంభం కుడివైపుగా గుళ్ళోకి ప్రవేశించాలి. అలా కాకుండా ధ్వజస్తంభ ఎడమ వైపు నుంచి గుడి లోకి ప్రవేశిస్తే గుడికి వెళ్ళిన ప్రతిఫలం లభించదు.
గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత మనం తీసుకెళ్లిన పూజ ఫలాలు దేవుడికి సమర్పించి దేవుడు ఎదురుగా ఎట్టిపరిస్థితుల్లోనూ నిలబడరాదు. దేవుడికి ఎదురుగా కాకుండా పక్కకు వచ్చి నిలబడి నమస్కారం చేసుకోవాలి. చాలా మంది పూజ ముగిసిన తర్వాత ప్రసాదం తీసుకొని బయటికి వచ్చి కాసేపు ఆలయంలో కూర్చుంటారు. అలా కూర్చునే సమయంలో పొరపాటున కూడా దేవుడికి వీపు చేసి కూర్చోరాదు. అలా కూర్చోవడం వల్ల పుణ్యం సంగతి అటుంచితే సకల పాపాలు తొలగుతాయి.
మరొక ముఖ్యమైన పొరపాటు ఏమిటంటే సాధారణంగా స్త్రీలు తల స్నానం చేసిన వెంటనే జడ వేసుకోకుండా అలాగే వదులుకొని దేవాలయాలకు వెళుతూ ఉంటారు. పొరపాటున కూడా దేవుడి దగ్గరకు అలా జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు. ఆలయ ప్రాంగణంలో జుట్టు చేతి వేళ్ళ గోర్లు పొరపాటున కూడా కింద పడకుండా జాగ్రత్త పడాలి.మన జుట్టు చేతి వేళ్ళ గోర్లు ఎవరైనా తొక్కినప్పుడు వారికున్న పాపాలు కూడా మనకి తగులుతాయి.