పనులు విజయవంతంగా పూర్తి కావాలంటే సోమవారం ఈ తప్పులు చేయకూడదు!

Devotional Tips: సోమవారం ఆ పరమశివుడికి ఎంతో పవిత్రమైన దినం. ఈ క్రమంలోనే ప్రతి సోమవారం పెద్ద ఎత్తున శివాలయాలలో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలాగే మరికొందరు పరమేశ్వరుడిని ధ్యానిస్తూ ఆ రోజు మొత్తం ఉపవాసంలో ఉండి పరమశివుని కొలుస్తుంటారు.ఈ క్రమంలోనే మనం ఏదైనా కొత్త పనులు అనుకున్నప్పుడు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటే సోమవారం పరమేశ్వరుడికి ఈ విధంగా పూజ చేయడం వల్ల మన పనిలో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా మన పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి.

సోమవారం ముఖ్యంగా మూడు రకాల పూజలతో స్వామి వారిని పూజించవచ్చు. ఆ పూజలు ఏమిటి అనే విషయానికి వస్తే.. ప్రతి సోమవారం ఉపవాసం ఉండటం, సోమ ప్రదోష వ్రత పూజ, 16 రోజుల సోమవారం వ్రత పూజ. ఈ విధంగా పూజలు చేయటం వల్ల మన పనిలో ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవు అలాగే మనం సోమవారం పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. మరి అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు పాలను రాగిపాత్రలో పోయకూడదు. రాగి అంటే పరమేశ్వరుడికి ఇష్టం కనుక రాగి పాత్రలో పోసిన పాలు నీళ్లతో స్వామివారికి అభిషేకం చేయకూడదు. అదేవిధంగా స్వామివారికి చందనం పూసి అభిషేకం చేయొచ్చు, కానీ ఆ చందనం పై పసుపు కుంకుమ వేయకూడదు. ఇక సోమవారం ఎవరైతే వ్రతం పాటిస్తూ ఉంటారో అలాంటి వారు తెల్లని వస్త్రాలను దానం చేయకూడదు. ఇక స్వామి వారికి అభిషేకం చేసే వారు నల్లని వస్త్రాలను ధరించకూడదు. అలాగే ఉత్తరం తూర్పు దిశలో ప్రయాణాలు చేయడం మంచిది కాదు.