Face Wash: ఈ ఆధునిక కాలంలో వాతావరణ కాలుష్యం పెరగటం వల్ల ,తీసుకునే ఆహారంలో మార్పులు వచ్చి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి . ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధిత వ్యాధులు కూడా అందరిని పట్టిపీడిస్తున్నాయి. సహజంగా అందరూ అందంగా కనిపించడానికి ఇష్టపడతారు.. దీనికోసం బయట మార్కెట్లో లభ్యమయ్యే అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు . ఇలా వాటన్నింటిని వాడటం వల్ల కొందరికి ఉపయోగం ఉన్నప్పటికీ కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది . ఇలా బయట మార్కెట్లో లభ్యమయ్యే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడం కన్నా మొహం కడుక్కునే విధానం సరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు . ముఖాన్ని శుభ్రం చేసుకునే విధానం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం .
అందంగా ఉండటానికి సరైన ఆహారం తీసుకోవటం ఎంత ముఖ్యమో..మనం ఫేస్‌వాష్ చేసే విధానం సరిగా ఉండటం కూడా అంతే ముఖ్యం . ముఖం కడుక్కొనే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు వల్ల మొటిమలు ,మచ్చలు , చర్మం ముడతలు పడటం వంటి సమస్యలు మొదలవుతాయి . వాటన్నింటిని అరికట్టడానికి ముఖం కడుక్కునే విధానంలో కొన్ని మార్పులు చేయటం చాలా అవసరం .
చాలామంది స్నానం చేసినప్పుడు శరీరానికి ఉపయోగించే టవల్ ని మొహానికి కూడా ఉపయోగిస్తుంటారు.ఇలా చేయటం వల్ల టవల్ లో ఉండే సూక్ష్మ క్రిములు మొహం మీదకు చేరి మొటిమలు, మచ్చలు రావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరానికి , ముఖానికి సపరేట్ గా టవల్స్ వాడటం చాలా అవసరం .
ముఖాన్ని శుభ్ర పరుచుకొనేటప్పుడు ఎక్కువ సార్లు కడగడం వల్ల ముఖం శుభ్రం అవుతుంది అనుకోవటం పొరపాటే. ముఖాన్ని ఎక్కువగా రుద్ధి కడగడం వల్ల ముఖం మీద తొందరగా ముడతలు వచ్చే అవకాశాలు ఉంటాయి .. అందువల్ల ముఖాన్ని కడుక్కునే సమయంలో సున్నితంగా రుద్దడం చాలా ముఖ్యమని అని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు .
చాలామందికి వేడి వేడి నీటితో స్నానం చేయటం చాలా అలవాటుగా ఉంటుంది . ఇలా చేయటం చాలా పొరపాటు .. స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి , అలాగే మొహాన్ని బాగా వేడిగా ఉన్న నీటితో కడగకుండా గోరువెచ్చగా ఉన్న నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి .
వేసవి కాలం వచ్చిందంటే వేడికి తట్టుకోలేక ముఖాన్ని చాలా చల్లని నీటితో కడుతుంటారు . ఇలా చాలా చల్లగా ఉన్న నీటితో ముఖాన్ని కడగడం వల్ల ముఖం మీద ఉన్న గ్రంధులలో ఉన్న మురికికి మొటిమలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది . ఇలా చిన్నచిన్న మార్పులు చేసుకోవడం వల్ల మీ ముఖాన్ని అందంగా ఉంచుకోవచ్చు .