Fever: మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పు రావడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్న సందేహం అందరిలోనూ ఉంటుంది. జబ్బు చేసినప్పుడు మాంసాహారం తినవచ్చా లేదా అన్న సందేహం కూడా ఉంటుంది.
సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం తినకూడదు అని మన పెద్దలు చెబుతుంటారు. జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం తినకపోవడం ఆరోగ్యానికి మంచిది. జ్వరం లేదా ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు తొందరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవటం శ్రేయస్కరం.
అనారోగ్యంగా ఉన్నప్పుడు శరీరంలో శక్తి తక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాలలో చికెన్, మటన్ వంటి మాంసాహార పదార్ధాలను తీసుకోవడం వల్ల కిడ్నీ మీద వాటి ప్రభావం చూపుతాయి. జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం తీసుకోవడం వల్ల పచ్చ కామెర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం, నూనె ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకపోవటం శ్రేయస్కరం.
అనారోగ్యంతో బాధపడుతున్న వారు చికెన్ తినాలనుకుంటే డాక్టర్ని సంప్రదించి వారి సలహాల మేరకు చికెన్ సూప్ వాటిని తయారు చేసుకొని తాగటం మంచిదనీ డాక్టర్లు సూచిస్తున్నారు. జ్వరం వచ్చినప్పుడు తొందరగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి శరీరం ఎక్కువ శక్తి వినియోగించే అవసరం లేదు.