Health Tips: ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఆకుకూరలు కూరగాయలు పండ్లు చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు చేర్చుకోవడం చాలా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పాలకూరలో మన ఆరోగ్యానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. రోజు మనం తినే ఆహారంలో పాలకూర అనే చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాలకూర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం.
పాలకూరను ఐరన్, క్యాల్షియం, విటమిన్ సి , విటమిన్ డి , జింక్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పాలకూర చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే క్యాల్షియం మన శరీరంలోని దంతాలు ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది.
ప్రతిరోజు పాలకూరను జ్యూస్ చేసుకొని ఒక కప్పు పరగడుపున తాగడం వల్ల జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు.శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు కరిగించి అధిక బరువు సమస్యలను తగ్గించడంలో కూడా పాలకూర ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రతిరోజు పాలకూర తినటం వల్ల మన శరీరానికి కావలసిన ప్రొటీన్లు లభిస్తాయి. కాకుండా పాలకూర లోని ఫ్లేవనాయిడ్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది.
పాలకూరలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ప్రతిరోజు ఏదో ఒక రూపంలో పాలకూర తీసుకోవటంవల్ల శరీరంలో రక్తహీనత సమస్య దరిచేరకుండా , శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా జరుగుతుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులను కూడా అరికట్టవచ్చు.