Chest pain: చిన్న, పెద్ద ఎవరినైన సరే ఛాతినొప్పి చాలా ఆందోళన కలిగించే పరిణామం. ఛాతీ నొప్పి వస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడవలసి వస్తుంది. పెద్దలలో చాతి నొప్పి వస్తే అది గుండె సంబంధిత వ్యాధులకు కారణం అయి ఉండొచ్చు. కానీ పిల్లలలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఛాతి నొప్పి పిల్లల కంటే పెద్దలలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పిల్లలలో ఛాతి నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. దీనికి పిల్లల యొక్క అంతర్గత ఆరోగ్య సమస్యలు కూడా కారణం అయి ఉండవచ్చు. పిల్లలు ఇటువంటి సమస్యలతో బాధ పడితే పేరెంట్స్ దానిని తేలికగా తీసుకోకూడదు.
లక్నోలోని సహారా హాస్పిటల్‌లో పని చేసే కన్సల్టెంట్ మరియు పీడియాట్రిషియన్ డాక్టర్ సుమన్ చక్రవర్తి మాట్లాడుతూ పిల్లలలో కండరాల ఒత్తిడి కారణంగా ఛాతి నొప్పి వస్తుందని, దీనిని మస్క్యులోసెలేటర్ ఛాతినొప్పి అని పిలుస్తారని చెప్పారు. ఇది చాతిలో ఉన్న ఎముకల నుండి ఉద్భవించి తర్వాత చాతి అంతట వ్యాపిస్తుంది. ఛాతీలో నొప్పికి ఇతర కారణాలు చేతిలో తిమ్మిర్లు అనిపించడం, నిరంతరం దగ్గు లేదా మృదులాస్థి వాపు వల్ల వచ్చే సమస్య. పిల్లలలో ఛాతి నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు, వారు ఛాతి నొప్పి మొదలైన వెంటనే డాక్టర్ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలలో చాతి నొప్పి రావడానికి గల కొన్ని కారణాలు:
• దగ్గు పిల్లలలో సర్వసాధారణం. ఎనిమిది సంవత్సరాల పిల్లలు ఎక్కువగా నిరంతర దగ్గుకు లోనవుతుంటారు. నిరంతర దగ్గు వల్ల పిల్లలలో ఛాతినొప్పి సమస్యలు వస్తుంటాయి. పెద్దల లాగా వారి కండరాలు, ఎముకలు బలంగా ఉండవు, ఫలితంగా ఛాతి నొప్పి సమస్యలు వారిని ఇబ్బంది పెడతాయి.
• న్యుమోనియా అనేది పిల్లలను తరచూ ఇబ్బంది పెట్టే సమస్య. ఈ సమస్యతో బాధపడే పిల్లల్లో వారి ఊపిరితిత్తులలో చికాకు, చాతి ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి తో ఇబ్బంది పడతారు.
• పిల్లలలో ఛాతి నొప్పికి గల కారణాలలో ప్రధానమైనది కండరాల్లో తిమ్మిరి గా ఉండటం. ఇది నరాల గోడ కండరాలలో ఏర్పడే తిమ్మిరి. ఈ నొప్పిని ప్రికార్డియల్ క్యాచ్ సిండ్రోమ్ అని అంటారు. తిమ్మిరి నిర్ధారణ తర్వాత కొన్ని రోజుల్లో దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు.
• పిల్లలు ఎక్కువగా ఆందోళన లేదా ఒత్తిడికి గురైనప్పుడు అది వారి గుండె మీద ప్రభావం చూపి ఛాతి నొప్పి కి దారి తీస్తుంది. ఇలాంటి సందర్భాలు చాలా అరుదు.
• పిల్లలకు వారి అన్నవాహికలో యాసిడిటి సమస్యలు తలెత్తితే అవి ఛాతి మీద ప్రభావం చూపుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల పిల్లలలో ఛాతి నొప్పి వచ్చే అవకాశం ఉంది.
• చిన్నపిల్లల్లో గుండెపోటు రావడం అనేది చాలా అరుదు. అయితే ఈ సమస్య వల్ల పిల్లలకు ఛాతి నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి.