Health Tips: ప్రస్తుత కాలంలో ఆహార పద్ధతుల్లో మార్పులు రావటం, భారీగా పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. చిన్న పిల్లలు, పెద్దవారు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల తొందరగా వ్యాధుల బారిన పడుతుంటారు. పిల్లలను ఎక్కువగా వేధిస్తుంటే అనారోగ్య సమస్యల లో పురుగులు సమస్య కూడా ఒకటి. ఈ నులిపురుగులు పిల్లల పొట్టలో తయారయి పిల్లల ఎదుగుదలను ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. నులి పురుగుల నిర్మూలన పై ప్రభుత్వం ప్రతి ఏటా పిల్లలకు నులిపురుగుల మాత్రలు సప్లై చేస్తోంది.
నులి పురుగులు కడుపులో ఉండటం వల్ల పిల్లల్లో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నులి పురుగులు వల్ల పిల్లల్లో తరచు వాంతులు, విరేచనాలు ఆకలి లేకపోవటం, బరువు తగ్గటం, ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో తరచూ ఈ లక్షణాలు ఉన్నట్లయితే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. లేదంటే పిల్లల ప్రాణానికే ప్రమాదం వాటిల్లవచ్చు. నులిపురుగుల సమస్య నిర్మూలించటానికి ఏం చేయాలో తెలుసుకుందాం.
అపరిశుభ్రత కారణంగా నులి పురుగులు పిల్లల పొట్టలో చేరుతాయి. అందువల్ల ఇంటిని ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ పిల్లల్ని కూడా శుభ్రంగా ఉంచాలి.ముఖ్యంగా పిల్లలు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. పిల్లలకు ఎల్లప్పుడు పౌష్టిక ఆహారాన్ని ఇస్తూ వారు తినే ఆహారం మీద ఈగలు, దోమలు వాలకుండా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు ప్రతిరోజు తాగటానికి కాచి చల్లార్చిన మంచి నీటిని ఇవ్వాలి. పిల్లలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూస్తూ పండ్లు, డ్రై ఫ్రూట్, పాలు వంటివి ఎక్కువగా ఇవ్వాలి. ఆరు నెలలకు ఒకసారి పిల్లలకు నులి పురుగులు మాత్రలు (ఆల్బెండజోల్ ) ఇవ్వాలి.