Health Tips: పిల్లలు తరచూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారా? వారి ఆహారంలో ఈ పదార్థాలు చేర్చండి..!

Health Tips: పెద్దలతో పోలిస్తే పిల్లలలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే వారు తినే ఆహారంలో అధిక మొత్తంలో పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల పిల్లలలో రోగనిరోధక శక్తి తగ్గి అనేక రోగాల బారిన పడవలసి వస్తుంది. పిల్లలు కొన్నింటిని ఇష్టంగా తింటారు, మరికొన్నింటిని ఎంత బుజ్జగించినా కూడా తినరు. పిల్లలకు ఇష్టం లేని ఆహార పదార్థాలను పేరెంట్స్ తినిపించాలి అనుకోవడం చాలా కష్టమైన పని. చలికాలంలో పిల్లలు ఎక్కువగా చిరుతిండ్లను తినడానికి ఇష్టపడతారు. వీటి రుచి వల్ల పిల్లలు ఎక్కువగా వీటికి ఆడిక్ట్ అవుతారు. అయితే షాపులో దొరికే ప్యాకేజ్డ్ చిరుతిండ్లు కంటే ఇంటిలో దొరికే కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల పిల్లలను ఆరోగ్యంగా ఉంచగలరు.

పిల్లలు ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా జబ్బులకు గురవుతున్నారు. చలికాలంలో పిల్లలకు చిలగడదుంప అంటే ఎంతో ఇష్టంగా తింటారు. చిలగడదుంపను ఆలివ్ నూనెలో వేయించి వాటికి జున్ను లేదా పనీర్ కలిపి తినిపించవచ్చు. కొంతమంది పిల్లలకు బీట్రూట్ అంటే ఇష్టం ఉండదు, పిల్లలు బీట్రూట్ తిననప్పుడు దానిని జ్యూస్ లేదా స్మూతీ లేదా కేక్ లాగా చేసి తినిపించడం మంచిది.

పిల్లలకు గోరువెచ్చని పాలు తాపడం మంచిది. వేడి పాలు తాగడం వల్ల పిల్లలకు బాగా నిద్రపడుతుంది. పాలు తాగడం వల్ల పిల్లలలో చురుకుదనం పెరుగుతుంది. పిల్లలు పాలు తాగకపోతే అందులో చాక్లెట్ పౌడర్ లేదా బాదం పప్పులు వేయడం వల్ల పాలు తాగుతారు. సాల్మన్ ఫిష్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. పిల్లలు వీటిని తినడం వల్ల బ్రెయిన్ షార్ప్‌ అవడమే కాకుండా, కంటి చూపు మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

రాగిలో ప్రోటీన్, ఫైబర్, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. పిల్లలకు రాగి రొట్టెలు పెట్టడం వల్ల ఎంతో ఆరోగ్యం. శరీరానికి కావాల్సిన తగిన పోషకాలు గుడ్లలో లభిస్తాయి. పిల్లలకు రోజు కోడి గుడ్లు పెట్టడం వల్ల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.