చిత్తూరు జిల్లాలో టీడీపీని కాచుకుని వచ్చిన కుటుంబాల్లో డీకే ఫ్యామిలీ కూడ ఒకటి. టీడీపీలో మోస్ట్ సీనియర్ అనే పేరు తెచ్చుకున్న నేత దివంగత డీకే ఆదికేశవులు నాయుడు. ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ ఈరోజు ఆనారోగ్యంతో కన్నుమూశారు. సత్యప్రభ రాజకీయ జీవితపు చివరి రోజుల్లో టీడీపీలో ఉంది బాగా ఇబ్బందిపడ్డారు. ఒకసారి వెనక్కి వెళ్లి డీకే కుటుంబం యొక్క రాజకీయ నేపథ్యాన్ని గమినిస్తే ఆర్థికంగా బలమైన ఆదికేశవులు నాయుడు టీడీపీని ఆర్థికంగా చాలానే ఆదుకున్నారనే ప్రచారం ఉంది. ఒకప్పుడు చంద్రబాబు చేసిన మీకోసం యాత్రకు ఆదికేశవుల నాయుడే ఫండ్ సమకూర్చినట్టు చెప్పుకునేవారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీలో చేరారు. చంద్రమబ్బు కూడ మొదట్లో ఆయనకు 2004లో తిరుపతి లోక్ సభ సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు కూడ. కానీ తర్వాతి ఎన్నికల్లో మాత్రం హ్యాండ్ ఇచ్చారు.
దీంతో నొచ్చుకున్న ఆదికేశవులు నాయుడు కాంగ్రెస్ పార్టీలోకే వెళ్లిపోయారు. అక్కడ వైఎస్ ఆయన బాగా రిసీవ్ చేసుకున్నారు. పార్టీలోకి వచ్చిన వెంటనే టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టి ప్రోత్సహించారు. 2013లో ఆదికేశవుల నాయుడు మరణించారు. దాంతో చంద్రబాబు తన రాజకీయం తిరిగి స్టార్ట్ చేశారు. ఆయన కుటుంబాన్ని పార్టీలోకి తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన సత్యప్రభ మంచి పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో కూడ ఆమె చిత్తూరు టికెట్ ఆశించగా చంద్రబాబు ఒప్పుకోకుండా ఆమెకు ఏమాత్రం బలం లేని రాజంపేట పార్లమెంట్ సీటుకు పంపారు. భయడ్డట్టే సత్యప్రభ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.
ఆమె ఓడిపోయింది చంద్రబాబు తప్పుడు నిర్ణయం వల్లనే. సరే ఓడిపోయాక ఏమైనా ఆమెకు పార్టీలో ప్రాముఖ్యత ఇచ్చారా అంటే లేదు. ఏడాదిన్నర పాటు దూరం పెట్టారు. దీంతో విసుగుచెందిన ఆమె కుమారుడు డీకే శ్రీనివాస్ వైసీపీలోకి వెళ్లే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి సన్నిహితుడు కావడంతో ఆయన సహాయంతో జగన్ వద్దకు వెళ్లి కలిశారు. ఆయన పార్టీలో చేరే విషయమై చర్చలు జరిపడానికే జగన్ వద్దకు వెళ్లారనే ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన బాబు మళ్లీ రాజకీయం స్టార్ట్ చేశారు. ఆ కుటుంబాన్ని బుజ్జగించడానికి సత్యప్రభకు రెండోసారి జాతీయ ఉపాధ్యక్షురాలు పదవిని ఇచ్చారు. ఇలా పలుసార్లు చంద్రబాబు రాజకీయానికి ఇబ్బందిపడిన సత్యప్రభ ఈరోజు అనారోగ్యంతో బెంగుళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.