దీపావళి పండుగ రోజున పొరపాటున కూడా అలాంటి పనులు చేయకండి?

ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 11న వచ్చింది. దీపావళి పండుగ రోజున జీవితాలలో ఉన్న చీకటిని తరిమేస్తూ వెలుగులను ఆహ్వానిస్తూ పండుగను జరుపుకుంటారు. దీపావళికి లక్ష్మీదేవి, వినాయక కొత్త విగ్రహాలను కొనుగోలు చేసి ఇంటికి తెస్తారు. ఇలా దీపావళికి లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు విగ్రహాలు కొనుగోలు చేయడం వల్ల డబ్బుకు కొరత ఉండదని విశ్వసిస్తూ ఉంటారు. దీపావళి పండుగ అంటే దీపాల పండుగ కాబట్టి ఆరోజు సాయంత్రం ఇంటిని మొత్తం దీపాలతో అందంగా అలంకరించి కొత్త బట్టలను ధరించి మొత్తం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీపాలి పండగకు టపాసులు పేల్చుతూ ఆ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు.

కొందరు టపాసులను పేల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని కేవలం దీపాలను వెలిగించి మౌనంగా ఉండిపోతారు. కొంతమంది టపాసులను కాల్చే సమయంలో కాల్చడం తెలియక, అజాగ్రత్తగా ఉండటం వల్ల ఎన్నో గాయలు కూడా అవుతుంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే కొన్ని రకాల పనులను కచ్చితంగా చేయాల్సిందే. ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టపాసులు పేల్చేటప్పుడు, దీపాలు వెలిగించేటప్పుడు మీరు సింథటిక్ దుస్తులను వేసుకోకూడదు. వీటికి బదులుగా కాటన్ దుస్తులను ధరించాలి. ముఖ్యంగా ఏ సమయంలో అయినా నీరు అవసరం రావొచ్చు కాబట్టి బకెట్ లో నీటిని మీకు అందుబాటులో ఉంచుకోవాలి.

మీ చెవులు టపాసుల సౌండ్స్ కు దెబ్బతినకుండా చెవుల్లో కాటన్ ప్లగ్లను పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే క్రాకర్స్ శబ్దం మీ చెవులను దెబ్బతీస్తుంది. టపాసులను కాల్చిన తర్వాత వాటిని ఖచ్చితంగా పారేయాలి. పేలని టపాసులు ఉంటే ఎందుకు పేలడం లేదని పరిశీలించడానికి ట్రై చేయకపోవడమే మంచిది. కొందరు అతి చేస్తూ దీపావళి పండుగ రోజున టపాసులను చేతులతో పేలుస్తూ తిక్క విన్యాసాలు చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు. కొన్ని కొన్ని సార్లు అవి చేతులలోనే పేలి గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. మీకు సమీపంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినట్లు అయితే వెంటనే అగ్నిమాపక దళానికి కాల్ చేయడం మంచిది.

అలాగేక్రాకర్స్ లేబుల్ పై ముద్రించిన సూచనలను ఖచ్చితంగా చదవాల. ముఖ్యంగా కొత్తగా క్రాకర్స్ ను కాల్చుతున్నవారు. చాలా మంది తమ సరాదా కోసం జంతువుల దగ్గర క్రాకర్స్ ను పేలుస్తుంటారు. కానీ ఇలా చేయడం అసలు మంచిది కాదు. అలాగే రోడ్డుపై వాహనదారులు ప్రయాణిస్తున్న సమయంలో క్రాకర్స్ ని కాల్చకూడదు. మీ చుట్టుపక్కల మండే పదార్థాలు ఉన్నప్పుడు టపాసులను పేల్చకూడదు. క్రాక్ర్స్ ను కంటైనర్ లో వేసి మూయకూడదు. టపాసులను కాల్చేటప్పుడు సురక్షితమైన దూరాన్ని పాటించాలి. టపాకాయలు కాల్చేటప్పుడు మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సమయంలో హెయిర్ లీవ్ చేయకూడదు. పొడవాటి జుట్టున్న వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు వారి జుట్టును ఏదైనా రబ్బర్ లాంటిది ఉపయోగించి ముడి వేసుకోవడం మంచిది. అతి ముఖ్యమైనది ఏమిటంటే టపాసులు పేల్చేటప్పుడు కచ్చితంగా చెప్పులు ధరించాలి.