ఆ హీరోయిన్ ఇక బ‌తుకదు.. ఎవ‌రూ కూడా ఆమెను ర‌క్షించ‌లేరంటూ బెదిరింపు కాల్స్

ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీల‌ను టార్గెట్ చేస్తూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు కొంద‌రు ఆగంత‌కులు. చంపేస్తామంటూ బెదిరించ‌డం లేదంటే వారి ఇళ్ళ‌ల్లో బాంబ్ ఉందంటూ పోలీసుల‌కు కాల్స్ చేయ‌డం వంటివి ఇటీవ‌లి కాలంలో చాలా చూశాం. విజ‌య్, ర‌జ‌నీకాంత్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌కు కూడా బాంబ్ బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీకు ఏకంగా చంపుతామంటూ కాల్స్ రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

లోఫ‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన దిశా ప‌టానీ ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో త‌న స‌త్తా చూపుతుంది. ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న రాధే అనే సినిమా చేస్తుంది. క‌రోనా వ‌ల‌న కొన్నాళ్ళు సినిమా షూటింగ్‌ల‌కు దూరంగా ఉన్న దిశా ప‌టానీ గ‌త ఏడాది చివ‌ర‌లో మాల్దీవుల‌కు వెళ్ళింది. అక్కడ బికినీలో ప‌లు ఫొటోలు దిగి వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇచ్చింది. రీసెంట్ గా కూడా కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో దిశా అందాల‌ను చూసి కుర్ర‌కారు ముగ్దులయ్యారు.

అందంతో పాటు అభిన‌యంతో అల‌రిస్తూ వ‌స్తున్న దిశా ప‌టానీకు తాజాగా ఓ ఆగంత‌కుడి నుండి కాల్ వ‌చ్చింది. ఆ కాల్‌లో ఆమెను చంపేస్తామంటూ బెదిరించాడ‌ట‌. అంతేకాక పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి దిశాను ఎవ‌రు కాపాడ‌లేర‌ని కూడా చెప్పాడ‌ట‌. పాకిస్థాన్ నుండి కాల్ వ‌చ్చిన‌ట్టు పోలీసులు అనుమానిస్తుండ‌గా, ఈ ఘ‌ట‌న‌పై లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. అస‌లు ఈ కాల్ నిజ‌మైన కాలేనా, లేదంటే కొంద‌రు దుండ‌గులు దిశాని బెదిరించ‌డ‌నాకి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా అనే దానిపై విచార‌ణ చేస్తున్నారు. దిశాని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావ‌డంతో దిశా కుటుంబ స‌భ్యుల‌తో పాటు ఆమె అభిమానులు కూడా ఆందోళ‌న చెందుతున్నారు.