Health Tips: గర్భవతులు ఆహారం విషయంలో పాటించవలసిన జాగ్రత్తలు..

Health Tips: మాతృత్వం అనేది ప్రతి మహిళకు ఒక వరం లాంటిది. తల్లి కావడం ప్రతి స్త్రీ తన అదృష్టంగా భావిస్తారు. ప్రతి మహిళ గర్భిణి గా ఉన్న సమయంలో చాలా జాగ్రత్త వహించాలి.. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం . గర్భం దాల్చిన సమయం నుండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వలన తల్లి , బిడ్డ కి అవసరమైన పోషణ ని అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గర్భిణీ స్త్రీ శిశువు ఆరోగ్యంగా జన్మించాలి అంటే అన్ని రకాల పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. గర్భవతులు ఆకుకూరలు , కూరగాయలు , పాలు , పండ్లు , మాంసం , చేపలు , పప్పు దినుసులు మొదలైనవి తప్పనిసరిగా తీసుకోవాలి. పుట్టబోయే శిశువు బరువు,తల్లి తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది.. కనుక గర్భవతులు తీసుకునే ఆహారంలో కాల్షియం , ఐరన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

గర్భవతిగా ఉన్న స్త్రీ రోజుకు మూడు పూటలా కన్న ఎక్కువ పౌష్టికఆహారం తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు , ముడి ధాన్యాలు పెరుగు తీసుకోవటం, గర్భవతులకు పుట్టబోయే బిడ్డకు చాలా అవసరం. గర్భవతులు రోజూ చేసుకొనే పనులలో నడక తప్పనిసరిగా ఉండాలి. టీ , కాఫీ తాగటం వలన శిశువు పెరుగుదలకు కావలసిన ఐరన్ లభించదు.. అందువలన భోజనం తర్వాత కాఫీ , టీ తీసుకోరాదు.

గర్భవతిగా ఉన్న సమయంలో పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శిశు అవలక్షణాలతో పుట్టే ప్రమాదం ఉండదు..అలాగే తగినంత అయోడిన్ తీసుకోవటం వలన పెరుగుతున్న పిండానికి తరువాత బిడ్డకు సరియైన మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది.