Weight LossTips:ఈ వంటకాలను ఎంత తింటే అంత బరువు తగ్గుతారని మీకు తెలుసా? మరి ఆ వంటకాలు ఏంటో తెలుసుకోండి!

Weight Loss Tips:భారతదేశంలో లభించే ఇన్ని రకాల ఆహార పదార్ధాలు బహుశా ఏ దేశంలోనూ లభించవేమో. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంటూ ఒక్కొక్క ఏరియాలో వారి వారి కల్చర్ ని బట్టి రకరకాల వంటకాలు తయారుచేస్తుంటారు. ప్రపంచంలో భారతదేశ వంటకాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీటిలో నార్త్ ఇండియా తో పోలిస్తే సౌత్ ఇండియా లో తినే వంటకాలలో అనేక రకాల పోషకాలు అధిక మోతాదులో లభిస్తాయి. భారతదేశంలో సౌత్ ఇండియా వంటకాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇడ్లీ, దోస, సాంబార్, రసం, లెమన్ రైస్, వడ వంటివి ముఖ్యంగా దక్షిణాది వంటకాలు. కానీ ఇవి దేశం మొత్తం లభిస్తాయి, వీటిని ఎంతోమంది ఇష్టంగా తింటారు. దక్షిణాది వంటకాలు చాలా రుచిగా ఉండటమే కాకుండా కేలరీలు, ఫైబర్ రిచ్ గా ఉంటాయి. శరీర బరువును తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.

ప్రతి రోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చటి నీటిలో కాస్త తేనె, నిమ్మరసం కలిపి తాగడం వల్ల మీ శరీర బరువును తగ్గించవచ్చు. శరీర బరువు తగ్గడమే కాకుండా జీర్ణక్రియ మెరుగు పడి ఆరోగ్యంగా ఉంటారు. ఇదే కాకుండా ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం అల్పాహారం ఎంతో ముఖ్యమైనది. రాత్రి అంతా జీర్ణప్రక్రియకు రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం తీసుకునే మొదటి భోజనం అల్పాహారం. ఉదయం రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన అల్పాహారంకోరుకునే వారికి సౌత్ ఇండియా ఫుడ్డు కు మించినది లేదు. మీరు బ్రేక్ ఫాస్ట్ కోసం ఇడ్లీ, సాంబార్ ,వేరుశనగ చట్నీ, కొబ్బరి చట్నీ లను తీసుకోవచ్చు. ఇవి తేలికగా జీర్ణమవుతాయి.

మీరు లంచ్ లో రాగి ముద్ద, అన్నము, మొలకెత్తిన సాలడ్లు, వెజిటేబుల్ కర్రీ, సాంబార్ లను తీసుకోవచ్చు. ఈ వంటకాలు త్వరగా జీర్ణం అవ్వడమే కాక మీ శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఈ ఆహారాలను మీ లంచ్ లో భాగం చేసుకోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకోదు.

చాలామంది సాయంకాలం పూట చిరుతిండ్లు తినడానికి తహతహలాడుతుంటారు. దీనిని నియంత్రించడానికి గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ లతో కలిపి మల్టీ క్గ్రైన్ బిస్కెట్లు లేదా పిస్తాలను తినవచ్చును. రాగి పాన్ కేక్ లేదా దోసె లను కూడా స్నాక్స్ గా తినవచ్చు. సౌత్ ఇండియన్ స్నాక్స్ లో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.

డాక్టర్ల సలహా మేరకు రాత్రిపూట భోజనం చాలా లైట్ గా ఉండాలి, ఇది త్వరగ జీర్ణం అయ్యే విధంగా ఉండాలి. నార్త్ ఇండియా లో లాగా రాత్రిపూట రోటీ తీసుకుంటే అది జీర్ణం అవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. బచ్చలి కూర పప్పు, మిక్స్డ్ పప్పు, పెరుగు, వెజిటబుల్ కర్రీ, కేరళ ఫిష్ కర్రీ, బ్రాండ్ రైస్ లను రాత్రి తినే డిన్నర్ లో ఉపయోగించవచ్చు. ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు ఒక కప్పు గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని తాగడం శ్రేయస్కరం.