Hindu Temple: భారతదేశంలో ఎన్నో శివాలయాలు గొప్ప గొప్ప కట్టడాలతో నిర్మించి ఉన్నాయి.కానీ కొన్ని శివాలయాలకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంది మన భారతదేశంలో. అందులో ఈ ఆలయం కూడా ఒకటి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని భోజ్పూర్ లో ఈ ఆలయం నిర్మించబడి ఉంది. పురాణాల ప్రకారం ఈ ఆలయంను పాండవులు తమ తల్లి అయినటువంటి కుంతీదేవికి పూజ చేసుకోవడానికి ఒక శివాలయము కోరగా పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఆలయంలోని శివలింగం ఒకే రాతి మీద చెక్కబడి ఉండటం విశేషం. దీని ఎత్తు 7.5, అలాగే దీని చుట్టుకొలత 17.8 అని పురావస్తు శాఖ వారు తెలుపుతున్నారు ఈ ఆలయంకు తూర్పు సోమనాథ్ అని కూడా పేరు ఉంది. ఈ ఆలయ కట్టడం 11,13వ శతాబ్దం కి సంబంధించినదని ఈ ఆలయంలోని శివలింగం భారతదేశంలోని అన్ని శివలింగాలు కంటే ఎత్తయినదని పురావస్తు శాఖ వారు తెలియజేశారు.
ఈ ఆలయంను పాండవులు తమ వనవాస సమయంలో తమ తల్లి ఆరాధన కోసం ఈ ఆలయాన్ని నిర్మించినరని భీముడు ప్రతిరోజు మోకాళ్ళ మీద కూర్చుని పూలను శివలింగానికి సమర్పించే వారట. కానీ ఈ ఆలయానికి ఎలాంటి శిలాశాసనాలు లేకపోవడం గమనార్హం.
ఈ ఆలయం చూడడానికి అతి సుందరంగా రాతి కట్టడంతో ఉంటుంది .ఈ ఆలయంను నిర్మించే సమయంలో పాండవులు రాత్రికి రాత్రే మాయమైపోవడం వల్ల ఈ ఆలయం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఒకవేళ ఈ ఆలయం పూర్తిగా నిర్మాణం అయి ఉంటే భారతదేశంలో ఈ ఆలయం మొదటి స్థానంలో నిలిచి ఉండేది.