రైతుల కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళ్లాడా..? రాబోయే ఐదు రోజులే తెలంగాణలో చాలా కీలకం

kcr modi

 తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నపళంగా ఢిల్లీ వెళ్ళటం, కేంద్ర మంత్రులు మొదలుకొని ప్రధాని మోడీ దాక వరసబెట్టి కలవటం జరిగింది. ఈ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించాయి. మొన్నటి గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ కేసీఆర్ మాట్లాడిన మాటలు మర్చిపోలేరు. పైగా నాలుగు రోజులు క్రితం రైతుల భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వటమే కాకుండా తెరాస మంత్రులను రోడ్లమీదకు పంపించాడు. అలాంటి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పెద్దలను కలవటం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తుంది.

kcr modi

 కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ చుట్టూ పక్కల దాని ప్రభావం ఎక్కువగా వుంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ ను ఢిల్లీ పెద్దలు కావాలని పిలిపించుకున్నట్లు తెలుస్తుంది. రైతు చట్టాల గురించి మట్లాడటానికే అమిత్ షా పిలిపించినట్లు తెలుస్తుంది. అందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన మరుక్షణమే కేంద్ర మంత్రుల దగ్గర నుండి మోడీ వరకు ఆపాయిట్మెంట్ దొరికినట్లు సమాచారం.

 నూతన చట్టాలపై కేంద్రం వెనకడుగు వేసే అవకాశం లేదని తెలుస్తుంది. ఇదే సమయంలో రైతులు కూడా రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి సమయంలో దేశంలో మిగిలిన పార్టీలు ఉద్యమానికి మద్దతు ఇస్తే కేంద్రానికి చిక్కులు తప్పవు, బీజేపీ వ్యతిరేక పార్టీలు ఎలాగూ ఉద్యమానికి మద్దతు ఇస్తాయి. తటస్థ పార్టీలను ఉద్యమానికి దూరంగా చేస్తే కేంద్రం దాదాపుగా సక్సెస్ అయినట్లే లెక్క. ఉత్తరాదిలో బీజేపీకి పట్టు ఉంది కాబట్టి ఉద్యమాన్ని కేవలం మూడునాలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తుంది. అదే విధంగా దక్షిణాదిలో కూడా ఉద్యమానికి మద్దతు రాకుండా చూసుకోవాలి.

 ఉద్యమాన్ని దక్షిణాదికి పాకకుండా చేయాలంటే తెలంగాణ కీలకం. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లతో పెద్దగా సమస్య లేదు. తెలంగాణ లో కాస్త కట్టడి చేయగలిగితే ఉద్యమం నీరుగారి పోవటం ఖాయమని బీజేపీ భావిస్తుంది. అదే కోణంలో కేసీఆర్ ను పిలిచి మాట్లాడినట్లు తెలుస్తుంది. మొన్నటి బంద్ లో తెరాస పార్టీ పాల్గొని విజయవంతం చేసినా విషయం తెలిసిందే, ఈసారి అలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరినట్లు తెలుస్తుంది. నిజంగానే బీజేపీ పెద్దలు పిలిస్తేనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లాడా..? వాళ్ళ మాటను గౌరవించాడా ..? అనేది తెలియలాంటే రాబోయే నాలుగైదు రోజుల్లో కేసీఆర్ తీసుకునే స్టాండ్ ని బట్టి అర్ధం అవుతుంది