జగన్ ఆ విషయంలో తొందరపడ్డాడా..?

YS Jagan getting ready for local body elections 

 ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పేరు గత కొద్దీ రోజుల నుండి దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. సుప్రీంకోర్టు కు కాబోయే ప్రధాన జడ్జి మీద ప్రస్తుతం వున్నా జడ్జికి ఫిర్యాదు చేయటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక రాజ్యాంగ శక్తిపై మరో రాజ్యాంగశక్తి దాడి చేయటమే అవుతుంది. వ్యవస్థలు ఎన్ని రకాలుగా ఉన్నకాని, అంతిమంగా ప్రతి వ్యవస్థ కూడా రాజ్యాంగానికి లోబడే నడుచుకోవాలి. అలాంటి రాజ్యాంగ శక్తులు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగితే భారీ మూల్యమే చెల్లించుకోవాలి. సీఎం జగన్ న్యాయ వ్యవస్థపై యుద్దానికి దిగటంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

cm jagan high court telugu rajyam

  న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసిన లేఖను ప్రభుత్వ ముఖ్య సలహాదారులతో ప్రెస్‌మీట్ పెట్టించి మరీ మీడియాకు విడుదల చేశారు. న్యాయమూర్తులకు రాజ్యాంగంలో.. రాజకీయ వ్యవస్థ నుంచి దాడిని తప్పించుకోవడానికి రక్షణలు ఉన్నాయి. వారు నిష్పాక్షికంగా తీర్పులు చెప్పడానికి భయం లేని.. పరిస్థితుల్లో న్యాయం చెప్పడానికి వారికి రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది. దాని ప్రకారం.. వారిపై ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తే సరిపోదు. దానికి కొన్ని లెక్కలుంటాయి. వారిపై ఏదైనా ఫిర్యాదును ముందుకు తీసుకెళ్లాలంటే.. ఓ ప్రక్రియ ఉంటుంది. అలా కాకుండా.. వారి మీద రాజకీయ నాయకులపై చేసినట్లుగా ఆరోపణలు చేసి.. మీడియాలో ప్రచారం చేయాలంటే కుదరని పని. అందుకే మీడియా కూడా ఈ విషయాన్నీ కవర్ చేయటంలో వెనకడుగు వేసింది.

  దీనిపై కూడా వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరి మీడియా మీద విమర్శలు చేస్తూ, ఒక ముఖ్యమంత్రి రాసిన లేఖను ప్రెస్ మీట్ పెట్టి తెలియచేసిన కానీ, ఎందుకు దానిని కవర్ చేయలేదనే ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ బలమైన రాజ్యాంగ శక్తి మీద ఇలాంటి ఆరోపణలను ఇష్టం వచ్చిన రీతిలో ప్రచారం చేస్తే రేపొద్దున సమస్యల వలయంలో చిక్కుకోవటం ఎందుకని మీడియా దూరంగా వుంది. చివరికి సాక్షి కూడా మొదటిలో దానిని కవర్ చేసిన ఆ తరువాత వాటి జోలికెళ్లలేదు. న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసి, దానిని ఒక ప్లాన్ ప్రకారం మీడియా ముందు ప్రవేశపెట్టి, ఆ తర్వాత మీడియా కవరేజ్ రాలేదని మీడియాను దుమ్మెత్తిపోయటం వెనుక అసలు కారణం ఉద్దేశ్యం ఏమిటో కొందరికి ఇప్పటికే అర్థమై ఉంటుంది. సీఎం జగన్ లాంటి యువనేత న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించి, దానిలో గెలుపుకోసం అనుసరించే ఇలాంటి మార్గం సరైనది కాదనే అభిప్రాయం మెజారిటీ వర్గాల నుండి వస్తుంది. మరి దీనిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తాడో.. చూడాలి..