Crime News: అన్ని ప్రయాణాలలో కెల్లా రైలు ప్రయాణం ఎంతో సురక్షితమైనదిగా భావిస్తారు. రైలులో ప్రయాణం చేయడం వల్ల నూటికి 99.9 శాతం ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా మన గమ్యాన్ని చేరుకోవచ్చు. అయితే కొన్ని అనుకోని సంఘటనల వల్ల రైళ్ళు కూడా ప్రమాదానికి గురవుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు భారీ నష్టం జరిగిపోతుంది. తాజాగా ఇలాంటి రైలు ప్రమాద ఘటన బెంగాల్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే…
జల్పాయిగురి జిల్లాలో బికనేర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రాజస్థాన్‌లోని బికనేర్ నుంచి నిన్న బయల్దేరిన ఈ రైలు పట్నా మీదుగా అసోంలోని గువాహటికి వెళ్తుండగా బెంగాల్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భాగంగా సుమారు 12 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ క్రమంలోనే గాయాలపాలైన వారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలిసిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై భద్రత చర్యలు చేపట్టారు.ఈ క్రమంలోనే ఈ ఘటనపై రైల్వేశాఖ స్పందిస్తూ ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి ఐదు లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ విషయం తెలిసిన దక్షిణ మధ్య రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందుకుంటున్నారు. ఈ క్రమంలోని నేడు ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించారు.ఇక పోతే ఈ ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వివరించగా రైల్వే ప్రమాద ఘటనపై నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయాలపాలైవారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.