వర్మకి షాకిచ్చిన మిర్యాలగూడ పోలీసులు !

వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ రూపొందించిన తాజా చిత్రం మర్డర్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నానని.. ఇది ఓ ‘కుటుంబ కథా చిత్రమ్’ అని వర్మ మొదటి నుంచీ చెబుతూ వస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రచార చిత్రాలు చూసినప్పటి నుంచి ఇది మిర్యాలగూడలో వివాదాస్పదమైన ప్రణయ్-అమృత నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరిగింది.

rgv made controversial comments

దీంతో ఈ సినిమా వివాదాస్పదమడమే కాకుండా అమృత కుటుంబ సభ్యులు దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. కేసును విచారించిన కోర్టు చివరకు ‘మర్డర్’ విడుదలకు అనుమతినిచ్చింది.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. ఇక సినిమాని పబ్లిసిటీ చేసుకోవడంలో తల పండిపోయిన వర్మ.. డిసెంబర్ 22మిర్యాలగూడ నటరాజ్ థియేటర్ ఎదుట రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతామని.. అక్కడే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామన్నది అప్పుడే చెబుతాననని అన్నాడు. అయితే రామ్ గోపాల్ వర్మ కు పోలీసులు షాక్ ఇచ్చారు. గొడవలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో పోలీసులు ఈ ప్రెస్ మీట్ కు అనుమతులు నిరాకరించారు. దీంతో చేసేదేమి లేక ఆర్జీవీ ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేశాడు. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

”మిర్యాలగూడ నటరాజ్ థియేటర్ వద్ద ఏర్పాటు చేయాలనుకున్న ప్రెస్ మీట్ కు అనుమతులు రాకపోవడంతో ప్రస్తుతానికి రద్దు చేసుకుంటున్నాం. కానీ తర్వాత తప్పకుండా వస్తాను. మాకు అన్ని విధాలుగా సహకరించినందుకు ఎస్పీ గారికి ధన్యవాదాలు” అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.