ఎంతమంది ఎమ్మెల్యే లు హ్యాండ్ ఇచ్చినా ఇతను మాత్రం చంద్రబాబు ని వదలమన్నా వదలడు !

Telugudesam Party

 

ఏపీ రాజకీయాల్లో రోజుకో మార్పు జరుగుతుండగా, టీడీపీకి మాత్రం షాక్‌ల మీద షాక్ లు తగులుతున్నాయి.. ఇప్పటికే ఏపీలో పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడి.. వైసీపీలో చేరిపోయారు.. కాగా వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్‌తో వరుసగా వలసలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే.. ఇలా రోజుకో నేత పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ గూటికి చేరుతుండడంతో టీడీపీ అధినేతతో పాటుగా, పార్టీ సీనియర్ నాయకులు కూడా మధనపడుతున్నట్లు సమాచారం.

ఇక వైఎస్ జగన్ ఆకర్శిస్తున్న వారిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా.. వారు వీరు అన్న తేడా లేకుండా వైసీపీ బాట పడుతుండటంతో రానున్న రోజుల్లో తెలంగాణాలో టీడీపికి పట్టిన గతే, ఏపీలో కూడా పడుతుందేమో అనే ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు ఉన్నట్లు తోస్తుంది.. ఇకపోతే వైసీపి నేత జగన్ ప్రవేశపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఈ సంవత్సరంలోనే న‌లుగురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు.. ప్రస్తుతం పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో పార్టీకి దూర‌మైన ఆ న‌లుగురిని తీసేస్తే మిగిలిన వారు 19 మంది ఉన్నారు. వీరిలో వియ్యంకులు అయిన బాల‌య్య‌, చంద్రబాబును ప‌క్క‌న పెట్టేస్తే ఇక మిగిలింది 17 మంది. పోనీ వీరైన సక్రమంగా ఉన్నారా అంటే వీరిలో మాజీ మంత్రి గంటా, గ‌ణ‌బాబు, బెందాళం అశోక్ లాంటి వాళ్లు పార్టీకి దూరంగా ఉంటుండగా, గొట్టిపాటి ర‌విని న‌మ్మే ప‌రిస్థితి లేదంటున్నారు. ఈ లెక్కలన్నీ చూస్తే టీడీపీని న‌మ్మి పార్టీలో ఉంటోన్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది..

ఇదీగాక తాజాగా వైఎస్సార్‌ సీపీలోకి, టీడీపీకే చెందిన మరో ఎమ్మెల్యే, టీడీపీ అర్బన్‌ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌ కుమారులిద్దరూ చేరడంతో విశాఖ నగరంలో టీడీపీకి కోలుకోలేని షాక్‌ తగిలిందనే చెప్పాలి. అందులో హార్డ్‌కోర్‌ టీడీపీ నేతగా ముద్రపడ్డ వాసుపల్లి ఎవ్వరూ ఊహించని రీతిలో ఇలా షాక్‌ ఇవ్వడంతో నగర టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం కమ్ముకుందంటున్నారు.. ఇన్ని క్లిష్టపరిస్దితుల మధ్య చంద్రబాబును వదలకుండా ఉన్నది ఒక్కరే, ఆయనే సామాజిక వ‌ర్గానికి చెందిన వెల‌గ‌పూడి బాబు.. చివరికి టీడీపీ అంతా ఖాళీ అయినా ఈయన మాత్రం బాబును వదిలేలా లేరని అంతా అనుకుంటున్నారట..